Telugu

వెంకన్నతో పెట్టుకుంటే మట్టి కరవాల్సిందే… మోడీకి చంద్రబాబు హెచ్చరిక

మహానాడు తొలిరోజు సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు ప్రసంగంలో శ్రీవారి ఆభరణాల మాయం అంశాన్ని కూడా తట్టారు. వెంకన్న జోలికి వెళితే ఈ జన్మలోనే శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సీఎం హెచ్చరించారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆభరణాల అంశంలో కొనసాగుతున్న వివాదం వెనుక భాజపా కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు భాజపా తెరవెనుకు కుట్ర పన్నుతోందన్నారు. తిరుమల ఆలయాన్ని పురావస్తు శాఖ ద్వారా స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నించిందని… ప్రజా వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గి నాలుక కరుచుకుందని తెలిపారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఎవరైనా మట్టి కరవాల్సిందేనని అన్నారు.

ADVERTISEMENT

విభజన హామీలు నెరవేర్చాలని అడిగినందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై కక్ష సాధింపులకు పాల్పడుతోందని చంద్రబాబునాయుడు అన్నారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని.. మనం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వాలు నడుచుకోకపోతే ఎక్కువ కాలం నిలబడని బీజేపీకి హితవు పలికారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

From Taapsee to Janhvi: Why Is South Cinema Blamed?

An actress has every right to speak when she feels uncomfortable on a film set.…

12 minutes ago

From Allu Arjun to Vishwak Sen: Police Get Cautious

Vishwak Sen planned to watch Cult with audiences at Hyderabad’s Sudarshan 35MM Theatre on its…

52 minutes ago