
ప్రతిపక్షపార్టీకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్లపై వైఎసార్సీపీ ప్రభుత్వ వైఖరి వినిపించే సందర్భంలో తనను, తమ పార్టీని విమర్శించారని చంద్రబాబు స్పీకర్‌తో అన్నారు. అలాంటప్పుడు తమ వాదన చెప్పుకునే అవకాశం కూడా సభలో లేకపోతే బయటకు వెళ్లి చెప్పుకోవాలా అని స్పీకర్ ను చంద్రబాబు నిలదీశారు. ఆ అవకాశం కల్పించని పక్షంలో, ఇంక అసెంబ్లీకి ఎందుకు రావడం అని ఆయన ప్రశ్నించారు.
“మీ అటెన్షన్ కోసం పదేపదే వేలు చెయ్యి నొప్పి పెట్టే విధంగా పైకి ఎత్తుతున్నామని.. కానీ మీ మనసు మాత్రం కరగలేదు’ అని స్పీకర్‌తో చంద్రబాబు అన్నారు. తమ వైపు చూడటమే మానేస్తున్నారని స్పీకర్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకో తనకు అర్థం కావడం లేదని చంద్రబాబు చమత్కరించారు. అయితే.. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై స్పీకర్ కూడా నవ్వుతూ బదులిచ్చారు. పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ మీరటు చూస్తే అందంగా కనబడతారని అన్నారని, అందుకే అటు చూస్తున్నానని స్పీకర్ చెప్పుకొచ్చారు.
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…
A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…