
చంద్రబాబు సమర్ధత వలన ఇప్పటివరకు ఎలాగోలో నెట్టుకొస్తున్నా, రానూ రానూ రాష్ట్రం పరిస్థితి దారుణంగా మారుతోందని తన మనోవేదనను మీడియా వర్గాలకు వివరించారు యనమల. అయితే బిజెపితో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. అయినప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం కలుగక పోవడం పట్ల రాష్ట్ర ప్రజలు కూడా మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధివిధానాలపై గుర్రుగానే ఉన్నారు. ఎన్నికల సమయంలో ఏపీని స్వర్ణమయం చేసేస్తానని చెప్పిన మోడీ, ఇపుడు కనీసం ఆంధ్రప్రదేశ్ ఊసు కూడా ప్రస్తావించడం లేదని ఆగ్రహిస్తున్నారు. ఇదంతా ఒక వైపు అయితే, నాణానికి మరో వైపు చంద్రబాబు నాయుడు వంతు ఉంది.
“కోరి తెచ్చుకున్న పిల్ల కాదు పొమ్మంటే పర్లేదు గానీ, నడిరోడ్డుపై అల్లరి పాలు చేస్తే” ఎలా ఉంటుందో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గత ఎన్నికల్లో మిత్రపక్షంగా నెత్తిన పెట్టుకున్న చంద్రబాబు, ఇపుడు బహిరంగంగా విమర్శించలేని పరిస్థితి. అదే జరిగిన నాడు, ప్రస్తుతం వస్తున్న అరకొర నిధులు కూడా మంజూరు కావన్న ఆందోళన చంద్రబాబు చేసిన పలు ప్రసంగాలలో స్పష్టమైంది.
జగన్ చెప్తున్నట్లు కేంద్రంతో వైరం తెచ్చుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం చాలా అవసరమని చాలా సందర్భాలలో చంద్రబాబు ప్రసంగించిన తీరు విజ్ఞులకు విదితమే. అలా గత రెండేళ్ళుగా రాష్ట్రంపై కేంద్రం ఎలాంటి విధానాలను అనుసరిస్తున్నా… ‘వన్ సైడ్ లవ్’ మాదిరి చంద్రబాబు మాత్రం కేంద్రంపై ప్రశంసలు కురిపిస్తూ, తనదైన స్థాయిలో పూర్తి సహకారం అందిస్తూనే ఉన్నారు. మరి బాబు గారి ప్రేమను కేంద్ర సర్కార్ ఎప్పటికి గుర్తించేనో గానీ, ‘ఫీల్ మై పెయిన్…’ అంటూ కేంద్రం వద్ద ‘వినతి పత్రాలు’ సమర్పిస్తూనే ఉంటున్నారు. ఇవన్నీ బహిరంగంగా చెప్పుకునే అంశాలు కాకపోవడంతో, చంద్రబాబు గారి వీరప్రేమగాధకు క్లైమాక్స్ ఏ విధంగా ఉంటుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…