Telugu

పవన్ లో ఎంత మార్పు… ఎంత మార్పు..!

ఆవేశానికి ‘ఆయువు’ పోసి దాని పేరు ‘పవన్ కళ్యాణ్’ అంటే అభిమానులు మురిసిపోతారేమో! అవును… పవన్ కళ్యాణ్ కు నిజంగా కాస్త ఆవేశం ఎక్కువే. బహుశా ఈ ఆవేశమే ఎంతో మంది యువతరాన్ని పవన్ కు చేరువ చేసి ఉండవచ్చు. ఉన్నదేదో ముక్కుసూటిగా మొహాన చెప్పేయడం పవన్ కు తెలిసిన స్టైల్. కానీ, ‘లాజిక్’ల కంటే కూడా మాటలతో ‘మ్యాజిక్’లు చేయాల్సిన రాజకీయ రణరంగంలో ఇలాంటి వ్యక్తి మనుగడ సాగించగలరా? అంటే అనాధిగా వస్తున్న రాజకీయ చరిత్ర దీనికి ‘నో’ అనే సమాధానం ఇస్తుంది. బహుశా ఈ విషయాన్ని గ్రహించారో లేక ప్రజలకు చేరువ అయ్యేందుకు తనను తాను మార్చుకున్నారో గానీ, పవన్ లో మునుపటి ఆవేశం కనపడడం లేదు.

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలను పరిశీలిస్తే… ఒక విధమైన ఖచ్చితత్వం, అలాగే ఇదే సమయంలో రొటీన్ రాజకీయ నాయకుడి స్వార్ధ రాజకీయ లబ్ది మాటలు కాకుండా, ఏ విషయంలోనైనా తన ప్రయత్నం మాత్రం నిక్కచ్చిగా చేస్తానని, ఫలితాలు ప్రజాభీష్టం అని చెప్పే ఉన్నత స్థాయికి పవన్ కళ్యాణ్ ఆలోచనలు చేరుకున్నాయని చెప్పాలి. నిజమే… రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఓటమిని అంగీకరించేందుకు కూడా పెద్ద మనసు ఉండాలని, ఓటమిని కూడా సహృదయంగా ఆహ్వానించడం నేర్చుకోవాలన్న జీవిత పాఠాలు ప్రస్తుత ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ చాటిచెప్తున్నారు.

ADVERTISEMENT

ఫలితాలు తాము ఆశించిన విధంగా రాకపోతే ‘ఫస్ట్రేషన్” ఎలా ఉంటుందో జగన్ తీరును చూస్తున్న వారికి ఇట్టే అర్ధమవుతుంది. దాని వలన స్వార్ధ రాజకీయ లబ్ది సంగతి పక్కన పెడితే రాష్ట్ర అభివృద్దికి జగన్ వైఖరి అవరోధంగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు గొంతు చించుకుని మరీ చెప్తున్నారు. అయినప్పటికీ జగన్ వ్యవహార తీరులో మార్పు లేదు. బహుశా పవన్ వ్యక్తపరిచిన “అభ్యుదయ భావాలు, రాజకీయ పరిణితితో కూడిన ఆలోచనలు” నిజంగా జగన్ కు ఉన్నట్లయితే… ఈ పాటికి ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమయ్యేదేమో… అనేటంతగా పవన్ తన పరిపక్వతను ప్రదర్శించారు.

నిజానికి ఆవేశపరుడికి ఆలోచనలు తక్కువ అంటుంటారు. కానీ, పవన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎలా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం కాస్త సెటిల్డ్ గా, రిలాక్స్ డ్ గా అగుపిస్తున్నారు. ఇంటర్వ్యూల సమయంలో తమకు కావాల్సిన సమాధానాల కోసం యాంకర్లు రకరకాల టెక్నిక్ లను ప్రయోగిస్తుంటారు. అయితే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఆచితూచి స్పందించడం పవన్ లో “మార్పు”ను సూచిస్తోంది. ప్రజలు మారాలి అంటే ముందుగా నాయకుడు తనలో ఉన్న లోపాలను సవరించుకుంటూ సాగాలి అన్న తీరుగా పవన్ వ్యాఖ్యలు నిలుస్తున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, శరణ్య… బాధితులు ఎవరు?

ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…

13 minutes ago

175/175 ఓ భ్రమ… ఈసారి మనమే మరో భ్రమ?

కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…

20 minutes ago