మార్చి 6 – ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు?

రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి స్తబ్దుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా ప్రోత్సాహం అందించినప్పటికీ, సంచలన రాజకీయాలకు ఏపీ నిలయం కాబోతోందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మార్పుతో ప్రారంభమైన ఈ ప్రస్థానం మార్చి 5వ తేదీ వరకు కొనసాగుతుందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

ADVERTISEMENT

గంట గడుస్తున్న కొద్ది ఎవరి పేరు ప్రముఖంగా వినపడుతుందోనని జగన్ వర్గీయులు ఎదురు చూడడం, మరుగంటలో వారితో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరణ ఇప్పించుకోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. అయితే వీటన్నింటితో పాటు మరో కీలక ఘట్టం మార్చి 6వ తేదీన ఏపీ రాజకీయాల్లోకి నమోదు కాబడుతోందని ప్రముఖంగా వినపడుతోంది.

స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీని నడపలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి మార్చి 6వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే భారీ బహిరంగ సభలో ‘కాషాయి’ కండువా కప్పుకునేందుకు నిర్ణయించుకున్నారని, తన సోదరుడు పవన్ కళ్యాణ్, అలాగే బిజెపి నేత సోము వీర్రాజుల ద్వారా జరిపిన చర్చలు సఫలీకృతం అయ్యాయని, “కాపులకు ముఖ్యమంత్రి పదవి” అన్న నినాదంతో బిజెపి ఈ సామాజిక వర్గాన్ని చిరంజీవి ద్వారా ప్రభావితం చేయబోతుందని పొలిటికల్, మీడియా వర్గాలు ప్రసారాలలో హల్చల్ చేస్తున్న అంశం.

Share
Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

2 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

5 hours ago