
ఇంటిపన్నులోనే పారిశుద్య ఖర్చులు కూడా ఉంటాయని మళ్ళీ అదనంగా చెత్తపన్ను ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు, మళ్ళీ ట్రూఅప్ పేరుతో అదనంగా ఛార్జీలు వసూలు చేస్తోందని, ఇంటిపన్నుని పెంచుకొనేందుకు మార్కెట్ ధరలతో ముడిపెట్టి పన్ను పెంచుకొంటోందని వారు ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చక్కటిపాలన అందిస్తామని చెప్పిన తమ ఓట్లు పొందిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఈవిదంగా ఇంటిముందు చెత్తపారబోసి ప్రజలను అవమానిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు వేలకోట్లు బకాయిలు పడినా చెల్లించదు. కానీ సామాన్య ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించడం ఆలస్యమైతే సిబ్బంది వచ్చి ఫ్యూజులు పీకేసి విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. అదేవిదంగా ఇప్పుడు చెత్తపన్ను చెల్లించకపోతే ఇంటి ముందు చెత్తపారబోసి ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఎన్ని సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నా ప్రజలను ఈవిదంగా పీడిస్తూ, ఇబ్బంది పెడితే మళ్ళీ అధికారంలోకి రాగలమా? అని వైసీపీ ప్రభుత్వం ఆలోచించుకొంటే మంచిది.
The YSR Congress Party (YSRCP) is facing a major challenge in Andhra Pradesh’s Local Body…
Misha Narang gives casual dressing a stylish little shakeup in this breezy photoshoot. An oversized…