Telugu

చంద్రబాబు ఆర్డరుకు సీఎస్ ససేమిరా?

ఈ నెల 10న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ ఎజెండా రూపొందించాలని చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ముఖ్యమంత్రి కార్యాలయం సూచించింది. ఈ ప్రకారం ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. ఐతే కేబినెట్ భేటీకి ఎజెండా రూపొందించడానికి చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం సుగుమంగా లేనట్టు తెలుస్తుంది. సీఎం కార్యదర్శి సాయిప్రసాద్‌, జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శి శ్రీకాంత్‌తో ఆయన మంగళవారం తన చాంబర్‌లో భేటీ అయ్యారు.

వారికి రాష్ట్రంలో కోడ్ ఉండడంతో కేబినెట్ భేటీ కుదరదు అని చెప్పినట్టు సమాచారం. ఇదే విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదితోనూ ఆయన భేటీ అయి సమాలోచనలు జరిపారు. కోడ్ అమలులో ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేబినెట్ మీటింగు పెట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకోవడాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. అయితే దీనిపై చంద్రబాబు అంటే పొసగని చీఫ్ సెక్రటరీ ఎలా స్పందిస్తారో చూడాలి.

ADVERTISEMENT

కేబినెట్‌ భేటీ ఎజెండాకే పరిమితమవుతుందా? లేదా బిజినెస్‌ రూల్స్‌పై కూడా చర్చించి ఎల్వీ సుబ్రహ్మణ్యం పై యాక్షన్ తీసుకుంటారా ? అని ఉత్కంఠ నెలకొంది. కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ప్రకారమే వ్యవహరించాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే సమీక్షా సమావేశాలకు అటు సీఈవో.. ఇటు సీఎస్ ఇద్దరూ అంగీకరించకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్‌ సమావేశం జరుగుతుందా..? లేదో వేచి చూడాల్సిందే మరి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

వర్క్ ఫ్రం హోం… మంచి ఆలోచనే!

అమెరికా-ఇరాన్‌ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఆ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం క్రమంగా పెరుగుతోంది. కనుక…

49 minutes ago

After A Month, PK Is Back On The Job!

It has been nearly a month since Andhra Pradesh deputy chief minister, Pawan Kalyan sustained…

1 hour ago