
మరికొన్ని సెకన్లలో లక్ష్యం చేరుకుంటారన్న సమయంలో, చివరి వంద మీటర్ల దూరంలో ఫినిష్ లైన్ మాత్రమే ఉండడంతో అంతా ఇక ఇథియోపియా రన్నర్లే విజేతలుగా నిలుస్తారని అందరూ భావించారు. అయితే చివరి నిముషంలో లక్ష్యం దిశగా కాకుండా, ట్రాక్ తప్పి పరిగెత్తారు. లక్ష్యం అందుకోవడానికి ఎడమవైపుకు తిరగాల్సి ఉండగా, దానిని గమనించకుండా ఇథియోపియా రన్నర్లు నేరుగా పరుగెత్తారు.
అయితే లక్ష్యం ఎడమవైపున ఉందని గుర్తించిన మూడోస్థానంలో ఉన్న రన్నర్ మాత్రం ఎడమవైపు తిరిగి పరుగెత్తాడు. ఇథియోపియా రన్నర్లకి నిర్వాహకులు సూచన ఇవ్వడంతో తిరిగి వెనక్కి వచ్చి పరుగెత్తినా లాభం లేకుండా పోయింది. అప్పటికే బహ్రెయిన్ రన్నర్ ఫినిష్ లైన్‌ని చేరుకోవడంతో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ ఆసక్తికర ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hyderabad is set to get another premium single-screen theatre. Mythri Movie Makers has taken Dilsukhnagar’s…
Allari Naresh knows exactly what he wants from the audience this time that's laughter, not…