
నిజానికి ఈ వేడుకను మొత్తం ప్రైవేట్ గానే నిర్వహించాలని చిరు కుటుంబ వర్గీయులు నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే మెగాస్టార్ కుటుంబం నుండి ఈ వివాహంపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. దీంతో శ్రీజ రెండవ వివాహం కావడంతో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ఆ కార్యక్రమం అంతా జరపాలని నిర్ణయించినట్లుగా తెలిసింది.
అయితే చిరు కుటుంబం వ్యక్తిగతంగా నిర్వహించాలనుకున్న వేడుక ప్రస్తుతం పబ్లిక్ అయిపొయింది. చేతి కట్టుతో మెగాస్టార్ పసుపు కొట్టడం నాటి నుండి తాజాగా పెళ్లికూతురిని చేసిన నాటి వరకు శ్రీజ వివాహానికి సంబంధించిన ప్రతి అంశం బయటకు రావడంతో ఎవరో కుటుంబ సభ్యుల ద్వారా ఉద్దేశపూర్వకంగానే ఈ ఫోటోలను విడుదల చేయిస్తున్నట్లుగా కనపడుతోంది. బహుశా మెగా అభిమానులకు సమాచారం చెప్పకుండానే చెప్పినట్లు ఉండడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారేమో అన్న కామెంట్లు వినపడుతున్నాయి.
Telangana politics are turning out to be extremely interesting in nature as we have multiple…
హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ తరగతి గదుల్లో మొదలైన ఓ సాదాసీదా బాల్య స్నేహం, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే…