
అయితే తాజాగా ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న సమాచారం ప్రకారం “ఖైదీ నెంబర్ 150”గా నామకరణం జరిగిందని, దీనిని అభిమానుల నుండి వచ్చిన స్పందన తర్వాత అధికారిక ప్రకటన ఉంటుందని టాక్. గతంలో మెగాస్టార్ చిరంజీవికి – ఖైదీ టైటిల్ కు ఉన్న అవినాభావ సంబంధం రీత్యా… ఈ “ఖైదీ నెంబర్ 150” టైటిల్ అదిరిపోయింది అన్న భావాలను మెగా ఫ్యాన్స్ వ్యక్తపరుస్తున్నారు. చిరంజీవిని కమర్షియల్ హీరోగా నిలబెట్టడంలో “ఖైదీ” సినిమా పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోయేది. అలాగే చిరు ఖాతాలో ‘ఖైదీ నెంబర్ 786’ వంటి హిట్ సినిమా కూడా ఉంది. దీంతో తాజాగా హల్చల్ చేస్తున్న “ఖైదీ నెంబర్ 150” టైటిల్ వైపు మెగా వర్గాలు మొగ్గు చూపే అవకాశం కనపడుతోందని తెలుస్తోంది.
మరింత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే… ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నిజంగానే ఖైదీ నెంబర్ 150గా కనపడనున్న విషయం ఇప్పటికే ఖరారైంది. షూటింగ్ పిక్స్ లీక్ అయిన వేళ మెగాస్టార్ షర్టు పైన 150వ సంఖ్య స్పష్టంగా కనపడింది. అది గాక, చిరు కెరీర్లో 150వ సినిమాగా ఇప్పటికే ఒక ప్రత్యేకతను చాటుకుంది. దీంతో “ఖైదీ నెంబర్ 150” అన్న టైటిల్ అన్ని విధాలా మెగాస్టార్ కు సానుకూలమైందని మెగా అభిమానులు భావిస్తున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన వస్తే అంతకు మించి మెగా ఫ్యాన్స్ కోరుకునేది ఏముంది..?
Playback singer Swagatha S. Krishnan has made serious allegations against an unnamed music director from…
Kollywood film Immortal starring G V Prakash Kumar and Kayadu Lohar in the lead roles…