Telugu

రాజకీయాల్లో ఇదే కొరవడిందిగా… చిరు..!

ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి పాలుపంచుకుంటున్న సినీ వేడుకలలో మరే ఇతర హీరో కూడా పాల్గొని ఉండరు. బహుశా రెగ్యులర్ గా సినీ వేడుకలకు యాంకరింగ్ బాధ్యతలు నిర్వహించే వారు కూడా మెగాస్టార్ పాల్గొన్న వేడుకల సంఖ్యను సరితూగలేదేమో! అయితే రాజకీయాలను విడిచిపెట్టి సినిమాలలో రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్, సదరు సినీ వేడుకలను తన పునాదులుగా వేసుకుంటున్నారు. మెగాస్టార్ గా ప్రేక్షకుల్లో ఎంత తిరుగులేని ఇమేజ్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులను సమ్మోహితులను చేసే సత్తా తనలో ఉందని చాటి చెప్పే విధంగా మరోసారి తనకు తానుగా పరిచయం చేసుకుంటున్నారు.

దాదాపు తొమ్మిది సంవత్సరాలు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న చిరు, తనంతట తానూ చొరవ తీసుకుని ఇలా సినీ వేడుకల్లో పాలు పంచుకోవడం శుభపరిణామమే. అయితే, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చూపుతున్న ఉత్సాహం, శ్రద్ధలో కనీసం సగం స్థాయి రాజకీయాల్లో చూపించినా… ఈ వెండితెర మెగాస్టార్, రాజకీయ రంగంలో ఒక స్థాయిలో ఉండేవారని పరిశీలకులు చెప్తున్న మాట. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ప్రేక్షకులను ఎలా తన వైపుకు తిప్పుకోవాలో అన్న విషయంపై బహుశా చిరుకు తెలిసినంతగా మరొకరికి తెలియకపోవచ్చు. అందుకే ఇలా సునీల్ సినిమా నుండి సైమా అవార్డుల వేడుక వరకు అన్నింటా తానై తళుక్కుమంటున్నారు.

ADVERTISEMENT

ఏ “లక్ష్యం” కోసం ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించారో బహుశా దానిని “విలీనం” ద్వారా విజయవంతంగా సాధించారో ఏమో గానీ, అప్పటి ఎన్నికల ప్రచారంలో ఉన్న ఉత్సాహం… ఫలితాలు వచ్చిన తర్వాత కొరవడింది. ‘ప్రజారాజ్యం’ కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత కేంద్ర మంత్రి అయినప్పటికీ, అది సినిమాల్లో ‘మెగాస్టార్’ అన్న బిరుదు మాదిరి, రాజకీయాల్లో ‘కేంద్రమంత్రి’ అని చెప్పుకోవడానికి వినియోగపడింది తప్ప, తనను ఆదరించిన ప్రజలకు చిరంజీవి చేసిందేమీ లేదన్న కఠోర నిజాన్ని మిగిల్చింది.

ఒక హీరోగా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్న చిరంజీవి, ఒక నాయకుడుగా ఎదిగేందుకు మాత్రం ఎలాంటి పధక రచన చేయకపోవడం అనేది ‘ప్రజాసేవ’ పట్ల చిరుకున్న చిత్తశుద్ధిని చాటిచెప్తోంది. రాష్ట్ర విభజన సందర్భంలో కాస్తో కూస్తో చిరు వెన్నంటే ఉన్న అభిమాన వర్గం కూడా పొలిటిక్స్ లో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఇక తానూ రాజకీయాల్లో ఉండి సాధించేది కూడా ఏమీ లేదని భావించారో ఏమో గానీ, గత ఎన్నికల నాటి నుండి 150వ సినిమా కోసం కూర్చుంటే… దాదాపు రెండేళ్ళకు సెట్స్ పైకి వెళ్ళింది. దీంతో సినీ వేడుకల్లో మెగాస్టార్ భాగస్వామి అయ్యి, అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా సింగపూర్ లో జరుగుతున్న సైమా అవార్డు వేడుకలో పాల్గొని… ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు.

Click Here for SIIMA Awards 2016 Photos

Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

Indian Arrested for Sexually Assaulting Teen Girl

Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…

34 minutes ago

Jagame Sangeetham Review: Superficial Remake, A Major Misfire

BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…

49 minutes ago