
ఒక సాధారణ అవార్డుల వేడుకలో మెగాస్టార్ లాంటి వ్యక్తి ముందుగా రిహార్సల్స్ చేయాల్సిన పనిలేదు. చిరు కాలు కదిపితేనే పండుగ చేసుకునే అభిమానులున్నారు. కానీ, చేసే కార్యక్రమం పర్ ఫెక్ట్ గా ఉండాలన్న భావనతో గత రెండు రోజులుగా రిహార్సల్స్ చేస్తూ ఉండడం యువతరానికి స్ఫూర్తిదాయకం. రిహార్సల్స్ చేస్తూ మధ్యలో అలా కాసేపు సేద తీరిన సమయంలో తళుక్కుమన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
రాజకీయాల్లో ఎలా ఉన్నా, సినిమాల విషయంలో మాత్రం 100కు 200 శాతం ఎఫర్ట్ పెడతారని ఈ ఫోటోనే చెప్తోంది. మరి ఈ వేడుకలో మెగాస్టార్ డ్యాన్స్ కోసం వేచిచూడడమే తరువాయి..! ముఖ్యంగా 150వ సినిమా ప్రారంభానికి ముందు వేయనున్న స్టెప్పులు ఖచ్చితంగా సినిమాపై పెను ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా ఉంది.
వైసీపీ లో షర్మిల రీ ఎంట్రీ, అన్న చెల్లెళ్ళ మధ్య పంచాయితీకి ఎండ్ కార్డు పడింది, వైఎస్ కుటుంబం తిరిగి…
The much-awaited trailer of Don’t Trouble The Trouble is finally out after its grand launch…