
మెగా స్టార్ చిరంజీవి తన స్వయం కృషితో సినీ రంగంలో పునాది రాళ్ళూ వేసుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ‘పద్మ విభూషణ్’ గౌరవాన్ని అందుకనే స్థాయికి చేరుకున్నారు.
నాలుగు దశాబ్దాల అనుభవం, స్టార్ హోదా ఉన్నప్పటికీ చిరు తానూ నటించబోయే సినిమాల విషయంలో ఎంత శ్రద్ధ చూపుతున్నారో తాజాగా రిలీజ్ అయిన మెగాస్టార్ జిమ్ వీడియో చూస్తే అర్ధమవుతుంది. యంగ్ హీరోలకు ధీటుగా జిమ్ లో చిరు కష్టపడుతున్నారు.
ఆరు పదుల యవస్సులో కూడా యువత చేసేంత స్థాయిలో చిరు జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది. ఈ వీడియో ను చూసిన వారంతా నిజంగా సినిమాల పట్ల చిరు కి ఉన్న ఫ్యాషన్ ను అభినందిస్తున్నారు.
చిరంజీవి లాస్ట్ రెండు సినిమాలు ఆచార్య, భోళా శంకర్ అటు చిరు అభిమానులను సైతం మెప్పించలేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. తన రెండు సినిమాలు ఊహించని డిసాస్టర్ కావడంతో కాస్త గ్యాప్ తీసుకుని సోషల్ ఫాంటసీ తరహా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మెగా స్టార్.
బింబిసారా సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించి హిట్ కొట్టిన మల్లిడి వశిష్ఠ విశ్వంభర తో చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నారు. దీనితో ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వచ్చే సంక్రాంతికి సినిమాను థియేటర్లకు తీసుకువస్తాం అంటూ చిత్ర యూనిట్ ప్రకటించడంతో ఇక చిరు సినిమా లో తన మేకోవర్ భాగంగా ట్రైనర్ సమక్షంలో జిమ్ లో వర్క్ ఔట్స్ మొదలుపెట్టారు.
అలాగే ఆ వీడియో ను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు మెగాస్టార్ కి, ఈ వయస్సులో కూడా మీ డెడికేషన్ కు సలాం అంటూ,ఈ విషయంలో కూడా మీరు యువతకు ఆదర్శంగా నిలిచారు బాస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Vaibhav Sooryavanshi was once again left out of India's playing XI for the fourth T20I…
Sundeep Kishan usually keeps things low-key while promoting his films and rarely makes big claims…