‘మెగాస్టారే’ ఆదర్శం అంటున్న ‘సూపర్ స్టార్’ రజనీ!

chiranjeevi inspired rajinikanth‘సూపర్ స్టార్’ రజనీకాంత్ అంటే ఒక తమిళనాడుకో, ఇండియాకో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా రజనీని అభిమానించే ప్రేక్షకుల సంఖ్య కోట్లల్లో ఉంటుంది. సినీ ఇండస్ట్రీలోనే కాదు, సాధారణ ప్రేక్షకులకు కూడా ఆయనే ఆదర్శం. ఆయన జీవితమే ఒక పాఠ్యాశం. ఇంతటి ఫాలోయింగ్ ఉన్న సినీనటుల జాబితాలో రజనీ ముందు వరుసలో ఉంటారు. మన దక్షిణాదికి వచ్చేసరికి రజనీనే నెంబర్ 1.

రజనీని అభిమానించే వారిలో రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారి రాజకీయ నాయకులు తమ వంతు ప్రయత్నంలో భాగంగా రజనీని ఏదొక పార్టీలోకి దింపాలని గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మరోసారి తమిళనాట సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో రజనీ రాజకీయ అంశం చర్చనీయాంశమైంది.

ADVERTISEMENT

ఈ సారైనా రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందో లేదో అనే ప్రశ్న మొదలవగానే దానికి సమాధానం కూడా దొరికింది. తెలుగు నాట మెగాస్టార్ గా వెలుగొందిన చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన రాజకీయ ‘ప్రజారాజ్యం’ పార్టీ చవిచూసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, రజనీ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. నిజానికి తనకు రాజకీయ రంగం వైపు ఆసక్తి లేకపోయినా, అభిమానులు, రాజకీయ ఒత్తిడిల మేరకు ఎప్పుడూ ఏదొక సమాచారం హల్చల్ చేస్తూనే ఉంటోంది.

తాజాగా సందడి చేస్తున్న సమాచారం మేరకు తన కంటే చిన్నవాడైనా… చిరు రాజకీయ అనుభవం రజనీకి బాగానే ఉపయోగపడినట్లుందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. అందరికీ రజనీ ఆదర్శంగా నిలుస్తుంటే, మన మెగాస్టార్ మాత్రం రజనీకే ఆదర్శప్రాయుడిగా నిలవడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories