
దానితో ఆయనకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించారట. ఇప్పుడు సినిమా షూటింగ్ జనవరి మొదటి వారంలో మొదలు కావొచ్చు. అప్పటికీ సిద్ధం కాకపోతే సంక్రాంతి తరువాతనే. ఈ సినిమాకు మణి శర్మ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఒకప్పుడు చిరంజీవికి బ్లాక్ బస్టర్ పాటలు ఇచ్చిన మణి ఈ మధ్యనే ఫామ్ లోకి వచ్చారు.
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తరువాత రామ్ నటిస్తున్న రెడ్, అలాగే వెంకటేష్ అసురన్ రీమేక్ కి కూడా ఆయనే మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. త్రిషను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఆమె గతంలో చిరంజీవితో స్టాలిన్ సినిమా చేసింది. ఈ సినిమాను ఉగాది సందర్భంగా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది.
సోషల్ మెసేజ్‌తో కూడిన మంచి కమర్షియల్ సినిమాలు తీయడంలో కొరటాల దిట్ట అని ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు ఈ కోవకు చెందినవే. ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమా కూడా సోషల్ మెసేజ్‌తో కూడుకుని ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను మేట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ (చిరంజీవి సొంత బ్యానర్) పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
A sad report has come from New York, where a student from Khammam, Telangana had…
టీడీపి సీనియర్ నాయకులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఎన్నికలను ఎట్టి…