Telugu

బొండా ఉమ సరిగ్గానే అంచనా వేశారుగా!

టీడీపి సీనియర్ నాయకులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా అడ్డుకోవాలని వైసీపీ కుట్ర చేస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు జరిగితే అది చాలా గొప్ప విషయమన్నట్లు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఏకగ్రీవాలు జరుగుతుంటే అక్రమం, అన్యాయం అంటూ కోర్టులను ఆశ్రయిస్తోంది. తద్వారా మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలకు నేను కూడా బాధితుడినే. వైసీపీ ఇప్పుడు అధికారంలో లేకపోయినా దాని తీరు మారలేదని అది సృష్టిస్తున్న ఈ అల్లర్లు, చేస్తున్న విధ్వంసం నిరూపిస్తోంది.

ADVERTISEMENT

ఈ ఎన్నికల ప్రక్రియ ముగిస్తే స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోంది. తద్వారా వాటిని నిర్వీర్యం చేసి మా ప్రభుత్వానికి అప్రదిష్ట కలిగించాలనే దురాలోచన వైసీపీలో కనిపిస్తోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తాం. వీటిలో మా కూటమి పార్టీలు ఘన విజయం సాధిస్తాయి,” అని అన్నారు.

నిబంధనల ప్రకారం నామినేషన్స్‌ వేసేందుకు అభ్యర్ధితో పాటు ఒకరు లేదా ఇద్దరినీ మాత్రమే లోనికి అనుమతిస్తారు. వైసీపీకైనా కూటమి పార్టీలకైనా ఇదే నిబందన వర్తిస్తుంది.

కానీ వందల మందితో లోనికి ప్రవేశించబోతే పోలీసులు అడ్డుకోవడం, వారితో ఘర్షణ పడటం, ఆ తర్వాత పోలీసులు తమపై దౌర్జన్యం చేశారంటూ కోర్టులకు పిర్యాదు చేయడం వ్యూహాత్మకమే అని చెప్పక తప్పదు. కనుక బొండా ఉమ వాదన సహేతుకంగానే అనిపిస్తుంది. ఇందుకు మరో తాజా ఉదాహరణగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడం కనిపిస్తోంది.

తమ నాయకులను ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా పోలీసులతో అడ్డుకుంటున్కునారని, తమ అభ్యర్ధులను నామినేషన్స్‌ వేయకుండా అడ్డుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కనుక తక్షణం తమ నాయకులందరినీ గృహ నిర్బంధంలో నుంచి విడుదల చేయాలని, తమ అభ్యర్థులు నామినేషన్స్ వేసేందుకు తగిన రక్షణ, ఏర్పాట్లు చేయాలని పిటిషన్‌లో కోరారు.

వైసీపీ పిర్యాదుల కారణంగా ఇప్పటికే ఒకసారి ఎన్నికల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. అయినా ఇదే విధంగా వైసీపీ పదేపదే పిర్యాదులు చేస్తుంటే అప్పుడు న్యాయస్థానాలు ఎమ్మెల్యే బొండా ఉమ చెప్పినట్లుగానే, ఈ ఎన్నికల ప్రక్రియను మొత్తం నిలిపివేసినా ఆశ్చర్యం లేదు.

ప్రజలు మన వైపే ఉన్నారని వైసీపీ బలంగా నమ్ముతున్నప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎందుకు ఇంతగా భయపడుతోంది?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది భయం కాదు వ్యూహాత్మకం అని బొండా ఉమ అంటున్నారు. వైసీపీ కాదనగలదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas the Leader of Anushka, Tamannaah & Trisha Gang?

Prabhas is celebrating his birthday, and fans have found yet another reason to celebrate the…

20 minutes ago

ప్రజలు మనవైపే ఉంటే ఇంత అల్లర్లు, విధ్వంసం దేనికి?

ఆంధ్రప్రదేశ్‌లో ఇదివరకు ఎన్నడూ చూడని సరికొత్త భయానక వాతావరణం మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్‌ ప్రక్రియలో కనిపిస్తోంది. ఇంతవరకు జరిగిన, ఇంకా…

41 minutes ago