Telugu

ముహూర్తం ఖరారు … ఫ్యాన్స్ భయపడుతున్నారు !

మెగాస్టార్ తో మెహర్ రమేష్ ‘భోళా శంకర్’ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయింది. కాస్టింగ్ అందరినీ ఫైనల్ కూడా చేసేశారు. ఎనౌన్స్ మెంట్ కే టైటిల్ తో పాటు కీర్తి సురేష్ స్టిల్ కూడా వదిలేశారు.

ఇప్పుడు ముహూర్తం కూడా ఖరారు అయిపోయింది. వచ్చే నెల 11న సినిమా ప్రారంభం కానుంది. మెగా స్టార్ తో చేస్తున్న మొదటి మెగా ప్రాజెక్ట్ కావడంతో నిర్మాత ఈ ఓపెనింగ్ కి బాగానే ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

ADVERTISEMENT

కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ విషయంలో హ్యాపీ గా లేరు. ముహూర్తం ఖరారు అంటే వారిలో ఇంకాస్త భయం పెరుగిపోతోంది. ఓ సందర్భంలో మెహర్ రమేష్ సినిమా చేయబోతున్నా అంటూ చిరు చెప్పడమే ఆలస్యం వద్దు బాబోయ్ అంటూ మెహర్ ని ట్రోల్ చేసి పారేశారు. మెగా ఫ్యాన్స్ కి ముందు నుండి ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం లేదు. దానికి స్ట్రాంగ్ రీజన్ ఉంది. మెహర్ చేసిన సినిమాలన్నీ అపజయాలే. బిల్లా ఒక్కటి అంత మంత్రంగా ఆడింది కానీ ఫైనల్ గా నిర్మాత కృష్ణం రాజుకి వర్కౌట్ అవ్వలేదు.

ఇక ‘శక్తి’ , ‘షాడో’ సినిమాలను ఇప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ , వెంకీ ఫ్యాన్స్ మర్చిపోలేక పోతున్నారు. అందుకే మెహర్ మెగా స్టార్ కి కూడా అలాంటి సినిమా అందిస్తారేమో అనేది మెగా ఫ్యాన్స్ భయం. కానీ ఇది రీమేక్ కాబట్టి వర్కౌట్ అయ్యే చాన్స్ ఉంది. చూడాలి మెహర్ తమిళ సినిమా కథతో మెగా స్టార్ కి బ్లాక్ బస్టర్ ఇస్తాడా ? లేదా ఎప్పటిలాగే అవకాశం వేస్ట్ చూసుకుంటాడా ?
chiranjeevi meher ramesh new movie starts from november 11th

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by
Tags: cross link

Recent Posts

Dancers Union Row: Satya Master’s ‘Mansion’ Remark Turns Heads

The Telugu dancers union dispute has taken another turn, with Satya Master now openly questioning…

13 minutes ago

That’s Why Sandeep Is a Mile Ahead!

In the film industry, getting the first chance and scoring a success itself is a…

42 minutes ago