Telugu

నాడు మిగులు బడ్జెట్..మరి నేడు…?

రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నాయకులు తమ అధికారం కోసం, తమ పదవుల కోసం మేనిఫెస్టో పేరుతో ఇష్టానుసారంగా ఉచితపథకాలు ప్రకటించుకుంటూ పోతున్నారు. అయితే ఇలా అధికారం కోసం పార్టీలన్నీ రాష్ట్ర ఖజానా నిధులను ఖాళీ చేస్తుంటే ఇక రేపటి తరం భవిష్యత్ కోసం మిగిలేదేమిటి.?

ప్రత్యేక తెలంగాణగా రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ధనిక రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ తో ఆర్థిక ఇబ్బందులు కు ఆవిడ దూరంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల కుప్పగా, ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోంది.? అందుకు కారణం ఎవరు.? ఎవరిని నిందించాలి.?

ADVERTISEMENT

స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే రాష్ట్ర ఆర్థిక దుస్థితి పై బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు అంటే సమస్య ఏ స్థాయికి చేరినట్టు.? అయితే సీఎం ప్రకటనలను ఎదో ఒక రాజకీయ ఆరోపణగానో, ప్రత్యర్థుల మీద చేసే రాజకీయ విమర్శ గానో కొట్టిపారేయలేము.

2023 ఎన్నికల సమయంలో అధికారంలో రావడానికి పదేళ్ల బిఆర్ఎస్ అధికారాన్ని గద్దె దింపడానికి కాంగ్రెస్ ఎన్నో ఎన్నికల హామీలను ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అని, తులం బంగారమని, మహిళలకు ఉచిత ఎలెక్ట్రిక్ స్కూటీలని…ఇలా చెప్పుకుంటూ పొతే మేనిఫెస్టో లిస్ట్ రాష్ట్ర బడ్జెట్ ని దాటిపోతుందనే చెప్పాలి.

అయితే ఇక్కడ ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఇలా అలంకాని హామీలు ఇచ్చిందని చెప్పాలేం. అసలు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఈ స్థాయి ఆర్థిక లోటుతో అల్లాడడానికి గత ప్రభుత్వాలు చేసిన ఆర్థిక తప్పులు, పొరపాట్లు, వారి ఉచిత పథకాల పంపిణీలు ఇలా అనేక కారణాలు ఉంటాయి.

అయితే ఇలా రాజకీయ పార్టీలు కేవలం తమ రాజకీయ స్వార్ధం కోసం ఇలా హామీల పేరుతో ప్రభుత్వ సొమ్మును పంచుకుంటూ, ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ పొతే రేపటి తరం భవిష్యత్ కి మిగిలేదేమిటి.?

అధికారం లో ఉన్నప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడనికి అధికార పార్టీలు, అధికార అందిపుచ్చుకోవడం కోసం ప్రతిపక్ష పార్టీలు ఉచిత పంపకాలను ప్రోత్సహించుకుంటూ పోయి, ఇప్పుడు మీరు ఎన్నికల హామీలను నెరవేర్చడం లేదని విపక్షాలు, మీరు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిపోయారు అంటూ అధికార పార్టీలు ఒకరిని ఒకరు నిందించుకుంటే ఫలితం ఉంటుందా.?

నా దగ్గర ఇవ్వడానికి ఏమి లేవు, పిల్లల బంగారు భవిష్యత్ కోసం విద్యను మాత్రమే అందించగలను, నిజాం ఇచ్చిపోయిన నిధులన్నీ అయిపోయాయి, ఇది చెప్పడానికి నాకేమి భయం లేదు, బెరుకు లేదు…కాబట్టి ప్రతి ఒక్కరు తమ తమ పిల్లల్ని విద్యావంతులుగా మార్చండి, లేకుంటే వారికీ ఆసక్తి ఉంటె స్పోర్ట్స్ లోకి ప్రోత్సహించండి, స్కిల్స్ నేర్పించండి అంటూ హైద్రాబాద్ లో జరిగిన జాతీయ విద్యాదినోత్సవంలో సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

సీఎం గా రేవంత్ ఇటువంటి ప్రకటనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు ఎక్కడ.? ఇంకెప్పుడు.? అంటూ బిఆర్ఎస్ నేతలు అధికార పార్టీని నిలదీసిన ప్రతిసారి రేవంత్ నుంచి ఇటువంటి ప్రకటనలే వెలువడుతున్నాయి. ఇది ఇక్క తెలంగాణ సమస్యో లేదా ఏపీ సమస్యో కాదు దేశం మొత్తం ఎదుర్కొటున్న సమస్య.

చివరికి న్యాయస్థానాలు కూడా రాజకీయ పార్టీల ఉచిత పథకాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసే స్థాయికి ఈ పంపకాల కార్యక్రమాలు సాగుతున్నాయి. వీటికి ఎవరో ఒకరు, ఎదో ఒక రాష్ట్రం ముగింపు పలికితే కానీ మిగిలినవారికి కనువిప్పు కలగదేమో..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Shook India But Cockroaches Gone Suddenly!

The Cockroach Janta Party of India had been extremely active in the social arena over…

24 minutes ago

షర్మిల, కవిత, విజయసాయి.. మూడు పార్టీలకు డెడ్ ఎండ్?

విజయసాయిరెడ్డి ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (పీఆర్పీ) ప్రకటిస్తూ వైసీపీ, కూటమి ప్రభుత్వంపై చాలా విమర్శలే చేశారు. వీటిపై ఆ రెండు…

35 minutes ago