
ఈ లోగా సోషల్ మీడియా లో ఒక పుకారు…. ఈ సినిమా కు కళ్యాణ్ కృష్ణ ను తప్పించి తమిళ దర్శకుడు మురుగదాస్ ని తీసుకుని వస్తున్నారని… మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో కొంత ఖుషి అయ్యారు.
మురుగదాస్ ఈ మధ్య కాలంలో ఫామ్ లో లేనప్పటికీ బెటర్ ఛాయస్ కదా!
దీనిలో నిజమెంత అని M9.News Team చిత్ర బృందంలోని ఒక కీలకమైన వ్యక్తిని సంప్రదించింది.
“ఈ పుకారు ఎలా మొదలయ్యిందో తెలీదు. 2-3 రోజుల క్రితమే పెమెంట్స్ కూడా చేశారు కోర్ టీమ్ కు. ప్రస్తుతం దసపల్లా లో సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఒక వారంలో స్క్రిప్ట్ లాక్ చేస్తాం. మాది F2 లాంటి ఫన్ సినిమా… దానికి మురుగదాస్ గారేంటో?,” అన్నారు.
దానితో చిరంజీవి తో మురుగదాస్ సినిమా అనేది ఫ్యాన్స్ లో ఒక వర్గం తమని తాము సంతృప్తి పరుచుకోవడానికి సృష్టించిన పుకారు కావొచ్చు.
ఇక పోతే చిరంజీవికి చాలా కాలం నుండి వేధిస్తున్న మోకాలు సమస్య… భోళా టైం లో ఫారిన్ సాంగ్ షూట్ అప్పుడు తిరగబెట్టింది… దానికి చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నారు. ఒక రెండు నెలలు ఆస్ట్రేలియా హాలిడే కి వెళ్లి రిలాక్స్ అవుతారని అంటున్నారు.
ఏది ఏమైనా చిరంజీవి కోలుకోగానే కళ్యాణ్ కృష్ణ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.
Festival releases are usually a dream for film producers for better openings and a chance…
Yashasvi Jaiswal has started working on wicketkeeping ahead of the 2026-27 Ranji Trophy season, but…