
అయితే తాజాగా ఈరోజు వినిపించిన వార్త ఏమిటంటే… చిరంజీవికి స్క్రిప్ట్ నచ్చలేదట. దానితో ఇది పక్కన పెట్టేద్దాం అని సుజీత్ కి తేల్చి చెప్పేశారట. హమ్మయ్య అని ఆనందించేలోగానే మెగా ఫ్యాన్స్ కు ఇంకో బ్యాడ్ న్యూస్ వినిపించింది. ఈ ప్రాజెక్టు స్థానంలో చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఇంకో సినిమా చెయ్యబోతున్నారట.
బాబీ బాగా ఎక్కువ అనుకుంటే యావరేజ్ ఇవ్వగలిగే దర్శకుడు. ఏదో తీశాడు అంటే తీశాడు అనే సినిమాలు అంతే… మెగాస్టార్ సినిమాల కుండే అంచనాలను ఆయన ఏ మాత్రం అందుకోలేదని అభిమానులు మదనపడుతున్నారు. తమ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు ఉంది అంటి సోషల్ మీడియాలో అనుకుంటున్నారు.
కరోనా పరిస్థితులు కొంచెం చక్కబడ్డాకా చిరంజీవి ఆచార్య షూటింగ్ పూర్తి చేస్తారు. ఆ సినిమా 2021 వేసవికి గానీ విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. బాబీ సినిమా 2021 రెండో భాగంలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు అని వార్తలు వస్తున్నాయి.
Ranbir Kapoor has apologised for his speech mistake at a Dussehra event in Kolkata. The…
After Little Hearts, Mouli connected strongly with the audience. However, the success also brought something…