కొన్ని నెలల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఒక తమిళ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి మాట్లాడారు. తనకు, రజినీకాంత్ వంటి వారికి మా మనస్తత్వాల కారణంగా రాజకీయాలు సరిపడవని, నన్ను అడిగితే అసలు ఆయన రాజకీయాలలోకి వెళ్ళకూడదు అని చెబుతూ అని చిరంజీవి అప్పట్లో చెప్పారు.
అయితే ఇప్పుడు ఆ విషయంగా చిరంజీవి ఒపీనియన్ మార్చుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈరోజు రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇండియా వైడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువగా వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించారు.
“ప్రియమైన స్నేహితుడికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో అద్భుతమైన విజయాన్ని సాధించినట్లే రాజకీయాల్లోనూ విజయం సాధించాలి. ఈ ప్రత్యేకమైన స్టైల్‌తో కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారు. ప్రజా సేవలోనూ మీ ప్రత్యేకతను చాటుకుంటారని ఆశిస్తున్నాను” అని అన్నారు.
మొత్తం మీద చిరంజీవి రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి తన అభిప్రాయం మార్చుకున్నట్టుగా ఉన్నారు. ఇకపోతే రజినీకాంత్ కు బర్త్ డే విషెస్ చెప్పిన వారిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. కాగా… ఈ నెల 31న రజినీకాంత్ తన కొత్త పార్టీ పేరుని, విధివిధానాలను ప్రకటించబోతున్నారు.





