
ఇక, తాజాగా మరొకరికి మెగాస్టార్ పబ్లిక్ వేదికపై ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అయితే అందులో ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ ఉన్నాయనుకోండి. అయితే మెగా నోట నుండి ఆ మాట రావడం కోసం ఎందరో సినీ ప్రముఖులు ఎదురు చూస్తూ ఉంటారు. మెగాస్టార్ చుట్టూ కొన్ని సంవత్సరాలుగా తిరిగినా రాని అవకాశం, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ కు ఒక్క ఆడియో ఈవెంట్ తో వచ్చేసింది. అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ హీరోగా తెరకెక్కిన “శ్రీరస్తు శుభమస్తు” సినిమా ఆడియో వేడుకకు విచ్చేసిన చిరు, సంగీత దర్శకుడు థమన్ ను ప్రశంసలతో ముంచెత్తాడు.
తొలినాళ్ళల్లో థమన్ సంగీతం విన్నపుడు పదాలను వినకుండా సంగీతం డామినేట్ చేస్తుందన్న ఫీలింగ్ నిజంగా కలిగింది గానీ, ఆ తర్వాత తర్వాత అవే పాటలకు ఆడిక్ట్ అయిపోతున్నామంటే అది థమన్ సంగీత మహిత్యమేనని ఆకాశానికెత్తేసారు మెగాస్టార్. తానూ గనుక 151వ సినిమా చేస్తే… సంగీత దర్శకుడుగా నువ్వే థమన్… అందులో నో డౌట్… అయితే మంచి ట్యూన్స్ అందిస్తే గనుక… అంటూ ఒక కండిషన్ పెట్టిన మెగాస్టార్.., ఇప్పటినుండే ట్యూన్స్ సిద్ధం చేసుకోమంటూ చెప్పడంతో ఆనంద పారవశ్యంలో మునిగి తేలడం థమన్ వంతయ్యింది.
అయితే మెగాస్టార్ 151వ సినిమా చేస్తేనే కదా… థమన్ సంగీతం అందించేది అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. 149 నుండి 150వ సినిమాకు రావడానికి దాదాపు తొమ్మిదేళ్ళ సమయం పట్టింది, మరో సినిమా అంటే ఇంకెంత సమయం తీసుకుంటారో..! అంటూ నెటిజన్లు పెద్ద చర్చకు తెరలేపారు. ఇలాంటి ఓపెన్ ఆఫర్లు అభిమానులను ఉత్సాహపరుస్తానికి బాగుంటాయేమో గానీ… కార్యరూపం దాల్చేది మాత్రం అతి కొద్ది సందర్భాలలో మాత్రమేనని గతంలో బోలెడు సినీ అనుభవాలు చెప్పాయి. అయితే థమన్ కు మాత్రం మెగాస్టార్ గారు మాంచి ‘బూస్టింగ్’ ఇచ్చారని చెప్పడంలో సందేహం లేదు.
Hero Sree Vishnu is coming up with a comedy entertainer Comrade Kalyan, directed by Janakiram…
Today, September 5 happens to be teachers Day and Andhra Pradesh chief minister Chandrababu Naidu…