
‘శుభాగృహ’ సంస్థకు సంబంధించిన ఈ యాడ్ లో చిరు సరసన కుష్భు నటించగా, ‘రంగమ్మత్త’ అనసూయ అసలైన రోల్ ని పోషించి, యాడ్ ను మరింత రక్తి కట్టించింది. మిడిల్ క్లాస్ వ్యక్తిగా కళ్లజోడుతో కూడిన మెగాస్టార్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.
ఈ యాడ్ ను సుకుమార్ దర్శకత్వం వహించారు. ‘రంగస్థలం, పుష్ప’ సినిమాలలో అనసూయకు ప్రత్యేకమైన పాత్రలు ఇచ్చిన సుకుమార్, ఈ యాడ్ లో కూడా ‘జబర్దస్త్’ బ్యూటీకి ఓ స్పైసీ రోల్ ను అందించి, మెగాస్టార్ తో ఓ రొమాంటిక్ సీన్ లో నటించే అవకాశం కల్పించారు.
సుకుమార్ – చిరులకు సంబంధించిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో, వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తుందేమోనన్న పుకార్లు షికారు చేసాయి. అయితే నిన్న సుకుమార్ వీటిపై స్పష్టత ఇస్తూ, ఓ యాడ్ కోసం తామిద్దరం కలిసినట్లుగా వెల్లడించారు.
రొమాంటిక్ సన్నివేశాలను ప్రతి నటుడు పండించలేరు. కానీ మెగాస్టార్ మాత్రం ఇందులో దిట్ట అని ఆయన సినిమాలే చెప్తుంటాయి. ఆ పాత సినిమాలను మరోసారి మననం చేసుకునే విధంగా అనసూయతో చేసిన రొమాంటిక్ సన్నివేశం కన్నులవిందుగా మారింది.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత కాస్టలీ అనేది నేటి రాజకీయ నాయకులు లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న స్థానిక…
Nani seems to be taking a cautious approach with Bloody Romeo after his experience with…