
బహుశా మెగా ఫ్యామిలీ నుండి ఒక క్రికెట్ టీంకు సరిపడ సభ్యుల సంఖ్య కోసం పోటీపడుతున్నారో ఏమో గానీ, ఇటీవలే చిరంజీవికి చిన్నల్లుడు అయిన శ్రీజ భర్త కళ్యాణ్ కూడా ముఖానికి మేకప్ వేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారన్న వార్తలకు బలం చేకూరుతోంది. ఈదిశగా ఇప్పటికే తన చిన్నల్లుడుకు మెగాస్టార్ యాక్టింగ్ క్లాస్ లకు పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫిజిక్, ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ తదితర విషయాలలో కూడా చిన్న చిన్న మార్పులు అవసరమని కళ్యాణ్ కు మెగాస్టార్ కొన్ని సలహాలు ఇచ్చారట.
ప్రస్తుతం సిద్ధం చేసుకుంటున్న ప్రణాళికలన్నీ కార్యరూపం సిద్ధించుకుంటే… ఈ ఏడాది శ్రావణమాసంలో చిన్నల్లుడు కళ్యాణ్ ఎంట్రీ ఉండవచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో మెగా హీరోను ప్రేక్షకులు భరించక తప్పదన్న సంకేతాలను సినీ వర్గీయులు ఇప్పటికే ఖరారు చేసేసారు. ఇలాంటి సమయంలోనే ప్రేక్షకుల మనసు చాలా గొప్పదైనది అన్న సంగతిని అందరూ గుర్తుంచుకోవాలి.
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…