
కాసేపటి క్రితం చిత్రబృందం తమ ప్రమోషన్లు మొదలు పెట్టింది. ఒక కొత్త పోస్టర్ విడుదల చేసింది. రేపు మధ్యాహ్నం 3.45కు తమ చిత్రం కు సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చెయ్యనున్నామని వారు ప్రకటించారు. ఈ వీడియో ద్వారా తమ చిత్రం స్థాయిని ప్రకటించాలని చిత్రబృందం భావిస్తుంది. ఈ మేకింగ్ వీడియో తరువాత అభిమానులు గుక్కతిప్పుకోకుండా ప్రమోషన్స్ ఉంటాయని టీం అంటుంది. ఈ వీడియో తరువాత చిరంజీవి బర్త్ డేకి థియేటర్ ట్రైలర్, కొన్ని ఈవెంట్లు, బాలీవుడ్ లో ఇంటర్వ్యూలు ఇలా చాలానే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న ఈ సినిమా ఎప్పటి నుండో చిరంజీవి డ్రీం ప్రాజెక్టు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా ,దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు, విజయ సేతుపతి, అమితాబ్, తమన్నా వంటి స్టార్ కాస్ట్ ఇతర ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ సినిమాలో నటించడం వల్ల సినిమాకు ఉత్తరాదిన కూడా హైప్ వస్తుందని మెగా కుటుంబం ఆశాభావంగా ఉంది. చూడాలి ఏం జరగబోతుందో!
One more day has passed in Bigg Boss, and one more day of Thrigun back-pitching…
Toxic has been a painful chapter for Yash and his team. But the actor’s response…