Uncategorized

అభిమానులకు బ్యాడ్ న్యూస్… మెగాస్టార్ కు మరో సర్జరీ..?

తమ అభిమాన నటుడు వెండితెరపై ఎప్పుడెప్పుడూ దర్శనమిస్తారా… అని వేయి కళ్ళతో నిరీక్షిస్తున్న మెగా అభిమానులందరికీ మరో దుర్వార్త అందుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో “కత్తి” సినిమా రీమేక్ కు కసరత్తులు జరుగుతున్న తరుణంలో, రేపో మాపో సెట్స్ పైకి వెళ్తుందని వేచిచూస్తున్న అభిమానగణానికి, సినీ ప్రేక్షులకు మెగాస్టార్ మరో ట్విస్ట్ ఇవ్వబోతున్నారని సమాచారం.

ADVERTISEMENT

‘కత్తి’ సినిమా రీమేక్ ను రామ్ చరణ్ ప్రకటించిన తర్వాత చిరంజీవి తన కుడి భుజానికి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో శస్త్రచికిత్స చేయించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన ఎడమ వైపు భుజానికి కూడా అదే హాస్పిటల్ లో చిరు శస్త్రచికిత్స చికిత్స చేయించుకోవడానికి సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో “కత్తి” రీమేక్ అన్నది ఇప్పట్లో ప్రారంభం కాబోయే సినిమా కాదని దాదాపుగా ఖరారైంది.

ప్రస్తుతం తన చిన్న కూతురు శ్రీజ వివాహ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిరంజీవి, ఈ శుభకార్యం ముగిసిన తర్వాత శస్త్రచికిత్స చేయించుకోవాలని భావిస్తున్నారట. 60 ఏళ్ళ మెగాస్టార్ గత కొన్నాళ్ళుగా భుజాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసినదే అయినా… ఆపరేషన్లు చేయించుకునే స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారని మాత్రం తెలియని విషయం. దీంతో శ్రీజ వివాహం తర్వాత మరికొన్నాళ్ళు మెగాస్టార్ గారు కట్టుతో దర్శనమివ్వనున్నారన్న మాట.

Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

Pics: Aarti Flaunts Hot Curves In Red Saree Look

Aarti Chikara is taking the internet by storm with a stunning new editorial shoot that…

15 minutes ago

KCR Is Coming Out of Farmhouse: Is Padayatra His Comeback Plan?

KCR appears ready to take his political fight against the Revanth Reddy government back to…

45 minutes ago