
ఆరు కేసుల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి, నాలుగు కేసుల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిలను నిందితులుగా పేర్కొంటూ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 34(ఏ), 37(ఏ3), 420, 487, 120బీల కింద వీరిపై అభియోగాలను మోపింది.
2014 ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వీరు భారీ ఎత్తున కల్తీ మద్యం తెచ్చినట్టు తేలింది. అప్పట్లోనే ఈ వ్యవహారం సంచలనం అయింది. ఎక్సైజ్ శాఖకు సుంకం చెల్లించకుండా, హాలోగ్రామ్ లను మార్చి, లిక్కర్ మాఫియా ద్వారా కల్తీ మద్యాన్ని వీరి అనుచరులు తీసుకొచ్చినట్టు విచారణలో గుర్తించారు. ఈ మద్యాన్ని ప్రయోగశాలలో పరిశీలించగా… దీన్ని సేవించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తేలింది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…