
అంతేకాక ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో 30 కంపెనీల సీఈవోలు పాల్గొనేలా చూడడం ఏపీకి ఆయనిచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనమని చెబుతున్నారు. అమరావతిలో సిస్కో సంస్థ అడుగుపెట్టేందుకు దాదాపు సిద్ధంగా ఉందని చంద్రబాబు బృందంలోని సభ్యులు తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా సిస్కో అధిపతి జాన్ చాంబర్స్ మాట్లాడుతూ ఈ చర్చలు ఆంధ్రప్రదేశ్, భారత్ పట్ల తమకున్న నిబద్ధతకు అద్దం పడతాయని, వ్యక్తిగతంగా చంద్రబాబు పట్ల తనకున్న గౌరవానికి సూచిక అని పేర్కొన్నారు.
అలాగే ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… సిస్కో కార్యకలాపాలకు అమరావతిని కేంద్రంగా చేసుకోవాలని కోరగా, చాంబర్స్ స్పందిస్తూ అమరావతిలో సిస్కో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. అయితే మరో వైపు బీపీఓ సేవల సంస్థ పట్రా కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాన్ ఎస్ సింప్సన్, చంద్రబాబుతో సమావేశమై, తమ సంస్థ ఏపీలో విస్తరణ పట్ల ఆసక్తిగా ఉన్నప్పటికీ, స్థలం లభించక రాయ్ పూర్ కు తరలి వెళ్లామని తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, పెట్రా కార్ప్ కు టెక్ మహీంద్రా బిల్డింగ్ ను కేటాయించాలని అక్కడికక్కడే ఏపీఐఐసీకి ఆదేశాలు జారీ చేశారు.
Following the failure of Kara, Dhanush is currently starring as the lead in Om directed…
#Romanchakam Review: Thin Story, Patchy Laughs Romanchakam has a wafer-thin story and relies heavily on…