
యాంకర్ స్వాతిగా, ఇంకా చెప్పాలంటే కలర్స్ స్వాతిగా అందరికీ సుపరిచితురాలైన స్వాతి అనంతరం సినిమాల్లోనూ నటించి పాపులారిటీ సంపాదించుకుని.. సడన్ గా పెళ్లి చేసుకుని సినిమాలకు, ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది.
అయితే.. పెళ్లైన కొన్నాళ్లకే ఆమె సపరేట్ గా ఉండడం మొదలెట్టడం, ఆ విషయమై కొన్ని మీడియా సంస్థలు రాసిన ఆర్టికల్స్ విషయంలో స్వాతి కాస్త ఘాటుగానే స్పందించింది. అఫీషియల్ గా డివోర్స్ గురించి ప్రకటించకపోయినప్పటికీ.. తన ప్రైవసీకి మాత్రం ఎవ్వరినీ భంగం కలిగించనివ్వలేదు.
ముఖ్యంగా “మంత్ ఆఫ్ మధు” సినిమాకి వచ్చిన రివ్యూల విషయంలో దర్శకుడు శ్రీకాంత్ నాగోతి కలిసి ఆమె మీడియా మీద ఫైర్ అవ్వడం అనేది కొన్నేళ్ల క్రితం చర్చనీయాంశమైన విషయంగా మారింది.
సడన్ గా ఇవాళ అదే “మంత్ ఆఫ్ మధు” దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించింది స్వాతి రెడ్డి. తన ఇన్స్టాగ్రామ్ లో రెండు ఫోటోలు పోస్ట్ చేసి తన పెళ్లిని అఫీషియల్ చేసింది.
శ్రీకాంత్ నాగోతి దర్శకుడిగా తెరకెక్కించింది రెండు సినిమాలు. ఒకటి “భానుమతి రామకృష్ణ”, కరోనా కాలంలో డైరెక్ట్ ఓటీటీ సినిమాగా విడుదలైంది. డీసెంట్ సినిమా అని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. కానీ.. రెండో సినిమా “మంత్ ఆఫ్ మధు” మాత్రం బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అవ్వలేదు. అతికొద్ది మంది క్రిటిక్స్ కి మాత్రమే నచ్చిన ఈ సినిమా రిజల్ట్ విషయంలో శ్రీకాంత్ & స్వాతి చాలా గట్టిగా రెస్పాండ్ అయ్యారు.
మరి రెండో పెళ్లి తర్వాత స్వాతి సినిమాలు కంటిన్యూ చేస్తుందా? లేదా? అనేది చూడాలి. ఇకపోతే.. శ్రీకాంత్ & స్వాతి ఇద్దరు ఒకే సంవత్సరం, ఒకే రోజు పుట్టడం అనేది గమనార్హం.
The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…
An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…