
దీనితో స్పెషల్ స్టేటస్ కోసం కార్యాచరణ రూపొందించే పనిలో పడ్డారు ఆయన. ఈ పరిణామాలపై చర్చించడానికి వామపక్షలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలలో వామపక్షాలకు పెద్దగా ఆదరణ లేకపోయినా వారితో ముందుకు నడవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
అయితే దీనికి కారణాలు లేకపోలేదు. జనసేన స్థాపించి నాలుగు సంవత్సరాలైనా ఇప్పటికి సరైన పార్టీ నిర్మాణం లేదు. పార్టీకి అధికార ప్రతినిధులని నియమించడానికే పవన్ కళ్యాణ్ కు నాలుగు సంవత్సరాలు పట్టింది. అటువంటి నిర్మాణంతో రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలపడం అంత తేలిక కాదు. దీనితో పోరాటాలు చెయ్యడం దిట్ట అయిన కమ్యూనిస్టులను వాడుకోబోతున్నారు. జనసేన వీక్ నెస్లను కమ్యూనిస్టుల వెనుక దాచే ప్రయత్నం చేస్తున్నారా?
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…