
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కాటమరాయుడు’ సినిమాలోని కొన్ని వ్యాఖ్యలు దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వికలాంగులను కించపరిచేలా ఉన్న వాటిని వెంటనే తొలగించాలని కోరుతూ… దివ్యాంగుల సేవా సంఘం అధ్యక్షుడు చంటి అండ్ కో, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వెంటనే ‘కాటమరాయుడు’ సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేసారు.
దివ్యాంగుల మనోభావాలను కించపరిచినా, అందుకు ప్రయత్నించినా వారిపై శాఖ పరమైన చర్యలు తప్పకుండా ఉంటాయని వినతిపత్రం అందించిన వారికి రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ హామీ ఇచ్చారు. అలాగే ఈ సినిమా దర్శకుడికి నోటీసులు పంపి, విచారణ చేస్తామని తెలిపిన శైలజ, ‘కాటమరాయుడు’ సినిమా చూసి, అందులో గల అభ్యంతరాలను తనకు తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరి ఏ సన్నివేశంలో దివ్యాంగుల మనోభావాలు దెబ్బతిన్నాయో మీకెవరికైనా తెలుసా..?
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…