Telugu

రేవంత్ పని రెండిటికీ చెడ్డ రేవడిలా అవుతుందా?

కాంగ్రెస్ లో తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేరనున్నాడు అనే వార్తలు రావడంతో కాంగ్రెస్ లో లొల్లి మొదలయ్యింది. రేవంత్ రెడ్డి తనతో పాటు వచ్చే కొంతమందికి టిక్కెట్లు అడుగుతున్నట్టు సమాచారం. ఐతే ఈ విషయం కాంగ్రెస్ సీనియర్ నాయకులకు రుచించడం లేదట.

ADVERTISEMENT

డీకె అరుణ, పొంగులేటీ సుధాకర్ రెడ్డి, గీతా రెడ్డి, సునీత లక్ష్మ రెడ్డి మరియు చాలా మంది రెడ్డి నాయకులు కాంగ్రెస్ లోకి ఆయన రాకను వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. డీకె అరుణ భాజపాతో టచ్లో ఉన్నట్టు సమాచారం కూడా ఉంది. రేవంత్ రెడ్డిని పార్టీలోకి తెస్తే తమంత టీఆర్ఎస్ గడప తొక్కల్సి వస్తుందని వారంతా హై కమ్యాండ్ ను బెదిరిస్తున్నారట.

మరోవైపు కోమటిరెడ్డి సోదరులు రేవంత్ రెడ్డి వంక పెట్టి కాంగ్రెస్ ను వదలడం ఖాయంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన నుండి వచ్చాక రేవంత్ పై ఒక నిర్ణయం తీస్కోనున్నారు. తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్ష, శాసనసభా పక్ష నేత పదవుల నుంచి రేవంత్‌రెడ్డిని తొలగించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరామని తెలంగాణ పార్టీ అద్యక్షుడు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు రేవంత్ రెడ్డిపై వార్తలు వచ్చాయని, రాహుల్ గాందీని కలిసినట్లు కూడా ప్రచారం జరిగిందని, అందువల్ల దానిపై వివరణ ఇవ్వాలని కోరామని, కాని ఇంతవరకు ఆయన నుంచి సమాదానం రాలేదని రమణ తెలిపారు. పొత్తుల విషయం చంద్రబాబు చూస్తారని ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.

ఒకవేళ కాంగ్రెస్ సీనియర్ల మాట గెలిచి హై కమ్యాండ్ రేవంత్ రెడ్డికి నో చెప్తే, అటు కాంగ్రెస్ లోకి వెళ్ళలేక ఇటు తెదేపాలో ఉండలేక రేవంత్ పని రెండిటికీ చెడ్డ రేవడిలా అవుతుందా? రాజకీయాల్లో కావాల్సిన నేర్పు ఓర్పు లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి సహజంగానే ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?

A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…

5 hours ago

The Paradise Has Hype, But Is It Enough?

Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…

5 hours ago