
ఓ పార్టీని ఎలా నడపాలో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. ఎలా నడపరాదో రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
జాతీయ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ:
ఒకప్పుడు దేశాన్ని, ప్రత్యర్ధులను కంటిచూపుతో శాషిస్తూ ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కనీసం రాష్ట్ర స్థాయిలో కూడా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. ఇందుకు తాజా ఉదాహరణ బీహార్ శాసనసభ ఎన్నికలలో ఓటమే. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాళ్ళు అరిగిపోయేలా బీహార్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. అయినా ఓటమి తప్పలేదు. ఎందువల్లనంటే ‘దొంగ ఓట్లు, ప్రలోభాల వల్లనే అని రాహుల్ గాంధీ సర్ది చెప్పుకోవచ్చు.
కానీ బీహార్‌లో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ కూటమి విజయం సాధించగలగాలి. అప్పుడే అది రాజకీయంగా కూడా గెలిచినట్లవుటుంది. కానీ వీటి వలననే తాము ఓడిపోయామని ఇప్పుడు సర్ది చెప్పుకోవచ్చు. కానీ భవిష్యత్తులో జరుగబోయే ప్రతీ ఎన్నికలో ఇవే పరిస్థితులు అంటే దొంగ ఓట్లు, ప్రలోభాలు ఉంటాయి కదా?
కనుక కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పుడూ ఏ ఎన్నికలలో గెలవలేకపోవచ్చు కదా? కనుక ఇటువంటి పరిస్థితులను ఏవిదంగా ఎదుర్కొని ఏవిదంగా విజయం సాధించాలో కాంగ్రెస్ పార్టీ ఫార్ములా కనిపెట్టాల్సి ఉంటుంది. కేవలం ప్రధాని మోడీని రోజూ విమర్శించడం వలన లేదా సెక్యులర్ పేరుతో ముస్లింలను ప్రసన్నం చేసుకోవడం వలన కాంగ్రెస్ పార్టీ గెలవదనే విషయం రాహుల్ గాంధీ గ్రహించాలి.
అన్నిటికంటే ముందుగా నాయకత్వ సమస్యని పరిష్కరించుకోవాలి. పార్టీ విధానాలు, ఆలోచనలు సమూలంగా మార్చుకోవాలి. మూస రాజకీయాలు చేయడం మానుకోవాలి. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా అవసరమైతే ఇలాంటి సమస్యలన్నిటినీ ఎదుర్కొంటూ పార్టీని సమూలంగా మార్చగల రేవంత్ రెడ్డి వంటి నాయకత్వ లక్షణాలున్న నాయకుడి చేతిలో పార్టీ పెట్టాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది.
Telugu cinema is facing a quiet but noticeable problem. Everything is starting to sound the…
Royal Challengers Bengaluru defeated Delhi Capitals in the 39th match of IPL 2026 at the…