
కర్నూలు టాలీలో మరో 16 కొత్త కేసులు చేరాయి. ఈ కాలంలో 3775 సాంపిల్స్ పరీక్ష చేశారు… అందువల్ల మరిన్ని కేసులు బయటపడ్డాయి. అయితే ఒక్క పాజిటివ్ విషయం ఏమిటంటే…. ఒకే కాలంలో 70 మందికి పైగా కోలుకున్నారు. ఇప్పటివరకూ కర్నూలులో అత్యధికంగా 174 కేసులు, గుంటూరులో 149 కేసులు ఉన్నాయి.
శ్రీకాకుళం మరియు విజయనగరం ఒక్క కరోనా పాజిటివ్ కేసు లేకుండా రాష్ట్రంలో ఉన్న జిల్లాలుగా కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో రెడ్ జోన్లుగా ఉన్న 97 మండలాల్లో తప్ప మిగతా చోట్ల ఈరోజు నుండి లొక్డౌన్ లో కొన్ని ఆంక్షలు సడలించారు. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది 2-3 రోజులలో తెలుస్తుంది.
పక్క రాష్ట్రమైన తెలంగాణ ఎటువంటి సడలింపులు ఇవ్వకుండా మే 7వరకు సంపూర్ణ లొక్డౌన్ అమలు చేస్తుంది. నాన్ – హాట్ స్పాట్ ఏరియాలలో కూడా కేంద్రం ఇచ్చిన సడలింపులు వద్దు అని తేల్చి చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రభుత్వం వీలైనంతగా ఆర్థిక కార్యకలాపాలు పునరుద్దించడానికే మొగ్గు చూపుతుంది.
Last week was a fairly entertaining one for the Telugu OTT audience as we had…
The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…