Telugu

‘జబర్దస్త్’ టీంకు షాక్! కోర్టు నోటీసులు!

బుల్లితెరపై వినోదాల విందు పంచుతూ సందడి చేసే ‘జబర్దస్త్’ షోపై విమర్శలు ఎన్ని వచ్చినా, దిగ్విజయంగా ఎపిసోడ్ లు కొనసాగుతున్నాయి. అలాగే ఎందరో కమెడియన్లను తెలుగు సినీ పరిశ్రమకు అందిస్తూ టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ షో టీంపై కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

‘జబర్దస్త్’లో ప్రసారమైన ఒక ఎపిసోడ్ న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఉందంటూ న్యాయవాది అరుణ్ కుమార్ ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు ‘జబర్దస్త్’ టీంకు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ కామెడీ షో పై గతంలో గౌడ విద్యార్థి సంఘం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కల్లుగీత కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా ఉందంటూ నాడు గౌడ విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు.

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

చొక్కా మడత పెట్టడం అంటే ఓటు వేయకపోవడమేనా.?

ఓటు ఒక దేశ భవిష్యత్, ఓటు ఒక నాయకుడి మీద నమ్మకం, ఓటు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు...ఆ హక్కును వినియోగించుకోవడం…

3 minutes ago

Rajamouli’s Master Plan for Varanasi OTT: Will It Work?

SS Rajamouli is known for changing the rules of Indian cinema, both in filmmaking and…

16 minutes ago