Telugu

వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే కరోనా వాక్సిన్

భారతదేశపు మొట్టమొదటి కరోనా వాక్సిన్ ను తయారు చేస్తున్న భారత్ బయోటెక్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు ఉదయం సందర్శించారు. జీనోమ్ వాలీ లో కంపెనీ వారితో కేటీఆర్ వాక్సిన్ ప్రోగ్రెస్ పై చర్చించారు. ఈ క్రమంలో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా తాము తయారు చేస్తున్న కరోనా వాక్సిన్ పై కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

“కొవాక్సీన్ అనే పేరుతో వస్తున్న ఈ వాక్సిన్ విషయంలో ఇప్పటికే ఎంతో నైపుణ్యం సాధించాం. వాక్సిన్ తయారీలో అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో తోడ్పాటుని అందిస్తున్నాయి. మేము పోటీదారులైన ఈ ఉమ్మడి శత్రువుపై పోరాటానికి కలిసికట్టుగా శ్రమిస్తున్నాం. అలాగే వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకు కొవాక్సీన్ ని తీసుకుని వస్తాం,” అని చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ముందు ఉన్న ఆక్సఫర్డ్ యూనివర్సిటీ వాక్సిన్ పై మనదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. లండన్‌లో జరిగిన హ్యూమన్ ట్రయల్స్‌లో ఇప్పటికే సత్ఫలితాలు రావడంతో తాజాగా ఈ వ్యాక్సిన్‌పై భారత్‌లోనూ ప్రయోగాలు చేయనున్నారు.

కోవిషీల్డ్ గా పిలుస్తున్న ఈ వాక్సిన్‌పై ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే నిర్వహించనున్నారు. సుమారు 5వేల మందితో భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. అలాగే త్వరలోనే పెద్ద పరిమాణంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి కూడా మొదలు పెడతామని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Ram Charan Must Use Jr NTR Now?

In under three weeks from now, Ram Charan will be returning to the big screen…

1 hour ago

సేవియర్ సూర్యకి ఇన్ని సినిమా కష్టాలా?

తమిళ నటుడు సూర్యని ముద్దుగా సేవియర్ సూర్య అని పిలుస్తూ ఉంటారు సినిమా అభిమానులు. ఎందుకంటే.. ప్రతి సినిమాలో సూర్య…

1 hour ago