
ఇప్పుడు పవన్ జగన్ వంటి వారికి అమిత్ షానే కరెక్టు అనడంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ ను తిట్టడం మొదలు పెట్టారు. నిన్న సిపిఐ రామకృష్ణ పవన్ ను ఘాటుగా విమర్శిస్తే…. ఇప్పుడు పవన్ తో తన చొక్కా మోయించుకున్న సిపిఎం మధు మరింత దారుణంగా మాట్లాడారు. పవన్ కల్యాణ్‌తో పాటు ఆ పార్టీకి పోయే కాలం దగ్గర పడిందని సీపీఎం నేత మధు వ్యాఖ్యానించారు.
అమిత్ షా లాంటి వాళ్లు దేశానికి కావాలనడం.. పవన్ రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. విచ్ఛిన్నకర శక్తిని, మతోన్మాద పార్టీని మెచ్చుకోవడం దారుణమన్నారు. బీజేపీతో స్నేహం జనసేనకు ఆత్మహత్యా సదృశ్యమేనని మధు పేర్కొన్నారు. ఎన్నికలలో పవన్ కళ్యాణ్ వామపక్షాలకు ఎక్కడ లేని ప్రాధాన్యతను ఇచ్చారు.
ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంతగా గణనీయ సంఖ్యలో సీట్లు కేటాయించారు. అయితే వారు ఒక్క సీటులో కూడా ధరావత్తు దక్కించుకోలేకపోయారు. అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు వామపక్షాలు తమ అసలు రంగులు చూపిస్తున్నాయి. మరోవైపు పోయే కాలం దగ్గర పడింది కాలం చెల్లిన వామపక్ష పార్టీలకు అని జనసేన అభిమానులు ఆరోపిస్తున్నారు.
One issue becoming impossible to ignore in the cinema industry is the growing fear surrounding…
తమిళనాడు ఎన్నికల ఫలితాల తరువాత విజయ్ టీవీకే పార్టీ గెలుపును ఆ పార్టీ అభిమానులు జరుపుకున్న దానికంటే కాస్త అధికంగానే…