
ఐపీఎల్ లో ‘చెన్నై సూపర్ కింగ్స్’ తరపున కెప్టెన్ గా వ్యవహరించిన ధోనిని స్థానిక వ్యక్తిగానే పరిగణిస్తారు. దీంతో తమిళనాట ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. దీనికి తోడు ‘సూపర్ స్టార్’ ఆశీస్సులు కూడా ఉంటే, ఆ క్రేజే వేరు కదా! రజనీని కలిసిన దానికి సంబంధించిన వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ధోని, అంతకు ముందు మరో వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు.
ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా చిత్ర హీరో సుషాంత్ రాజ్ పుత్ మరియు చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పాల్గొన్న మహేంద్ర సింగ్ ధోని, సూపర్ స్టార్ సినిమాలైన ‘భాషా, నరసింహా’ల స్టైల్ ను అనుకరించాడు. ‘ఈ భాషా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే’ అని కోట్ ను వెనక్కి వేసుకునే తీరును మరియు ‘నా దారి రహదారి… బెటర్ డోంట్ కంఇన్ మై వే..’ అంటూ వేలు చూపించే తీరును ఇమిటేట్ చేసిన ధోని… మళ్ళీ తమిళ అభిమానుల మనసు కొల్లగొట్టాడు.
The term of the BR Naidu-led Tirumala Tirupati Devasthanams (TTD) governing board has come to…
Karthik Subbaraj’s Dorothy has found a new audience after its recent Netflix premiere. Despite receiving…