Telugu

జై లవకుశ… ‘బాహుబలి 2’ని ఫాలో అయిపో..!

వర్తమానం నుండి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే… “బాహుబలి 2” ధియేటిరికల్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న రోజు. ముహూర్తం సాయంత్రం 5 గంటలకు ఫిక్స్ చేయగా, ఉదయమే చిత్రానికి సంబంధించిన తమిళ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో లాభం లేదనుకున్న చిత్ర యూనిట్… మొత్తం మూడు భాషలకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను యూ ట్యూబ్ లో విడుదల చేసారు. ఆకాశమే హద్దుగా ఉన్న ట్రైలర్ ఆలిండియాలోనే సరికొత్త రికార్డులు సృష్టించింది.

ఇక రికార్డుల మాట పక్కన పెడితే… ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ – బాబీల “జై లవకుశ” సినిమా పరిస్థితి కూడా ఇదే. జూలై మొదటి వారంలో విడుదల కావాల్సిన టీజర్ లీకుల బారిన పడి, ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా శరవేగంగా పాకిపోతోంది. దీనిని ఎవరు లీక్ చేసారన్న విషయంపై నిర్మాత కళ్యాణ్ రామ్ కేసు అయితే పెట్టగలిగారు గానీ, సోషల్ మీడియాలో సదరు టీజర్ సర్క్యూలేట్ కాకుండా మాత్రం ఆపలేకపోయారు. దీంతో ‘బాహుబలి 2’ మాదిరే “జై లవకుశ” టీజర్ ను అఫిషియల్ గా విడుదల చేస్తే బెటరేమో!

ADVERTISEMENT

జరగాల్సిన నష్టం ఎలాగూ జరిగిపోయింది గనుక, ఆ టీజర్ ను అధికారికంగా విడుదల చేస్తే ఆ లీక్ నుండి ఎంతోకొంత బయటపడిన వారవుతారు. ఎలాగూ ఈ సినిమాపై బోలెడు క్రేజ్ కూడా ఉంది కాబట్టి, యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. చిత్ర యూనిట్ నిర్ణయించుకున్న జూలై మొదటి వారానికి, ప్రస్తుత సమయానికి రోజులు కూడా పెద్దగా వ్యత్యాసం లేవు గనుక, ఇంకా విడుదల చేసి లేట్ చేసే కంటే కూడా అధికారికంగా విడుదల చేయడమే మేలన్న టాక్ వ్యక్తమవుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Irumudi Is A Miracle In Mythri’s Journey: Producers

The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…

48 minutes ago

సీఎం హోదాలోనే అసెంబ్లీ కి…

ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…

53 minutes ago