Telugu

CSK – MI గత వైభవాన్ని గుర్తుచేస్తాయా.?

ఐపీఎల్ చరిత్రలో ఒకప్పుడు అత్యంత హీట్‌ను తీసుకొచ్చిన పోరు అంటే ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ అంటే కేవలం రెండు జట్ల పోటీ మాత్రమే కాదు, అంతకు మించి అనేలా ఉండేది. రెండు జట్ల అభిమానుల మధ్య సోషల్ మీడియా ఫ్యాన్-వార్స్, ఆటగాళ్ల మధ్య పోటీ— ఇలా ఈ మ్యాచ్ ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాగా ఉండేది.

కానీ కాలంతో పాటు ఈ క్లాసిక్ రైవల్రీలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఈ ఇరు జట్లు సమాన స్థాయిలో నువ్వా నేనా అన్నట్టుగా మైదానంలో తలపడేవి. పోరులో విజయం ఎటు వెళ్తుందో చెప్పడం కూడా అత్యంత కష్టసాధ్యంగా ఉండేది.

ADVERTISEMENT

చివరి బంతి వరకు ఇరు జట్ల అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూనే సాగేది ఈ పోరు. కానీ ఇప్పుడు గత కొన్ని ఏళ్లగా ఈ ఎల్-క్లాసికో పూర్తిగా ఏకపక్షంగా మారిపోతున్నాయి. దీంతో ఈ రైవల్రీ తన పాత మాయాజాలాన్ని కొంత కోల్పోయినట్లు అనిపిస్తోంది.

అయితే ఐపీఎల్ 2026 కు గానూ ఎల్-క్లాసికో గా పిలవబడే ఈ పోరు నేడు ముంబై లోని వాన్ఖేడే వేదికగా జరగనుంది. నేటి మ్యాచ్లో ఓటమి చెందిన జట్టు సుమారు ప్లే-ఆప్స్ పోరు నుండి బయటకు వెళ్ళినట్టే. ఈ ఒత్తిడి ఇరు జట్ల ఆటగాళ్లపై స్పష్టంగా కనిపించనుంది.

ఇటు చూస్కుంటే చెన్నై జట్టు తాము చివరగా ఆడిన మ్యాచ్లో హైదరాబాద్ పై సులువైన విజయాన్ని చేజార్చుకుని మ్యాచ్ ని కోల్పోయారు. బౌలింగ్ లో ఓ మాదిరిగా రాణించినప్పటికీ, బ్యాటింగ్ లో చెన్నై కు కష్టాలు ఇంకా తీరలేదు. ఇది చాలదన్నట్టు ఫామ్ లో ఉన్న ఆయుష్ గాయం కారణంగా ఈ ఐపీఎల్ నుండి తప్పుకున్నారు అనే న్యూస్ చెన్నై ఫ్యాన్స్ ను మరింత ఢీలా చేస్తుంది.

గడిచిన రెండు రోజుల నుండి మాజీ భారత కెప్టెన్- వికెట్ కీపర్, మహేంద్ర సింగ్ ధోని నెట్స్ లో బ్యాటింగ్ మరియు కీపింగ్ విపరీతంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించగా, ఈ మ్యాచ్ ఆడనున్నాడని నిన్న చాలా వార్తలు వచ్చినప్పటికీ, నేటికీ ఈ విషయాన ఏ అధికారిక ప్రకటన లేదు.

మరోవైపు ముంబై జట్టు తమ 13 ఏళ్ళ జింక్స్ ను బ్రేక్ చేస్తూ, మొట్ట మొదటిసారి ఐపీఎల్ లో తమ తొలి మ్యాచ్ ను గెలిచి రికార్డ్ తిరగరాయగా, ఆ పిమ్మట వరుసనే 4 మ్యాచ్లలో ఓటమిను చవిచూడక తప్పలేదు. అద్భుతమైన ఆటగాళ్ళెంతమందో ఉన్నప్పటికీ జట్టు ఎందుకు రాణించలేకపోతుంది అని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.

అదే సమయంలో గుజరాత్ జట్టు పై అహ్మదాబాద్ లో ఆడిన మ్యాచ్ 99 పరుగులతో గెలిచి, అటు నెట్ రన్-రేట్ ను ఇటు అహ్మదాబాద్ లో తమ చరిత్రలోనే మొదటిసారి గుజరాత్ జట్టుపై గెలుపు సాధించి మంచి జోష్ లో ఉన్నారు ముంబై. తిలక్ వర్మ సెంచరీ తో రాణించడం ముంబై ఆ మ్యాచ్లో విజయాన్ని అందుకుంది.

ఆ గెలుపు జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలి. ఇప్పుడు ఈ రెండు జట్లు మళ్లీ ఒకరికొకరు ఎదురవుతున్నారు. కానీ ఈసారి ఇది పాత రోజుల్లా ఫైనల్ పోరు కాదు, ఇది ప్లే-ఆఫ్ ఆశలను నిలబెట్టుకునే పోరు. నేటి మ్యాచ్లో ఓటమి చెందే జట్టు సుమారు ఐపీఎల్ 2026 కు గుడ్-బాయ్ చెప్పేసినట్లే.

ఈ నేపథ్యంలో, ఈ మ్యాచ్ మళ్లీ పాత ఉత్కంఠను తెస్తుందా అనే ప్రశ్న ఉంది. ఫ్యాన్స్ మాత్రం మరో క్లాసిక్ పోరును ఆశిస్తున్నారు. ఎవరు గెలిచినా, ఈ మ్యాచ్ ఐపీఎల్ కథలో ఒక మలుపుగా నిలవొచ్చు. ఈ మ్యాచ్ మళ్ళీ పూర్వం చెన్నై-ముంబై ల పోరును గుర్తుకుతెచ్చేలా ఉండాలని కోరుకుందాం.. మరి నేటి మ్యాచ్లో గెలుపు ఎవరిదనుకుంటున్నారు?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Haiwaan Public Talk: Akshay Kumar’s Film Dead on Arrival?

Haiwaan arrived in theatres after a long wait. Expectations were sky-high for a lot of…

6 minutes ago

ప్రతిపక్షాలకు మాత్రమే: గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత…ఓడితే ప్రభుత్వ దౌర్జన్యం…

స్థానిక ఎన్నికల సమరానికి పార్టీ క్యాడర్, లీడర్ లకు కూటమి ప్రభుత్వం మీద యుద్ధం చెయ్యాల్సిందే అంటూ తేల్చి చెప్పిన…

33 minutes ago