Telugu

గెలిస్తే ఇక్కడి నుండి సమరం, లేదా తిరుగు ప్రయాణం..!

ఇప్పటికే 42 మ్యాచ్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నది ఈ ఐపీఎల్ 18 వ సీజన్. ఎన్నో రసవత్తర మ్యాచ్లను వీక్షించి అభిమానులు హోరెత్తిన సన్నివేశాలు ఉన్నాయి, అదే అభిమానులు తమ ఫెవరెట్ జట్టు ఆటతీరు, ఫామ్ ను చూసి ఢీలా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఈ సీజన్ లో ముఖ్యంగా చెన్నై మరియు హైదరాబాద్ జట్టు అభిమానులకు ఈ స్థితి కలిగింది.

ఇప్పటికే ఈ రెండు జట్లు 8 మ్యాచ్లు ఆడగా ఈ రెండు జట్లు, పేలవమైన ఆటతీరుతో పాయింట్ల పట్టిక లో చిట్ట చివరి స్థానాన్ని ఎప్పటినుంచో ఒడిసిపట్టుకున్నాయి. ఆడిన 8 మ్యాచ్లలో 2 మ్యాచ్లలో గెలిచి, మిగతా 6 మ్యాచ్లలోను ఒడి తమ అభిమానులను నిరాశలోకి నెట్టేశాయి ఈ ఇరు జట్లు. అయితే, మరి ఇవాళ చెన్నై చెపాక్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

ADVERTISEMENT

ఈ మ్యాచ్ కేవలం ఒక లీగ్ మ్యాచ్ ఏ కాదు, ఏదో ఒక జట్టు కు ఎలిమినేటర్ వంటిది కూడా. ఇవాళ ఓడిన జట్టు ఇంక ప్రాక్టికల్ గా ప్లే-ఆఫ్ రేసు నుండి నిష్క్రమించబడినట్టే. అయినా గణాంకాల బట్టి ఏదోక అవకాశం ఉన్నప్పటికీ, అవన్నీ ఈ సీజన్లో చెల్లవు. ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్ మరియు బెంగళూరు జట్లు ఆరేసి మ్యాచ్లలో నెగ్గి, పాయింట్స్ టేబుల్ ను లీడ్ చేస్తున్నారు.

ఇంకా, ఈ లెక్కన చూస్కుంటే ఇవాళ్టి మ్యాచ్ ఏదోక జట్టును ఈ ఐపీఎల్ 2025 నుండి వెలివేయబోతుంది. నిన్న, చిన్నస్వామి లో రాజస్థాన్ ఓటమితో వారి ప్లే-ఆఫ్ ఆశలు ఇప్పటికే గల్లంతయిపోయాయి. ఇక, ఇవాళ ఓడిన జట్టు పాయింట్ల పట్టిక లో రాజస్థాను కు తోడవుతుంది. మరొక ఆసక్తికర విషయమేమిటంటే, గడిచిన కొన్ని ఏళ్ళ నుండి చెన్నై గ్రౌండ్ లో హైదరాబాద్ జట్టుకు అస్సలు మంచి అనుభవాలు లేవు.

వారం-పది రోజుల ముందు, హైదరాబాద్ మరియు చెన్నై కు తోడు గా ఉన్న ముంబై ఇప్పడు ఏకంగా టాప్-4 లో కి ఎగబాకారు. వరుసగా 4 మ్యాచ్లు గెలిచి, ఫామ్ అందుకుని, తామెంటో నిరూపిస్తున్నారు. ఇప్పటికైనా, ఈ రెండు జట్లకు కమ్-బ్యాక్ చేసేందుకు అవకాశాలు లేకపోలేవు. మరి ఒక వర్చువల్ నాక్-అవుట్ ను తలపిస్తున్న ఈ మ్యాచ్ లో ధోని సేన పుంజుకుంటుందా..? లేక హైదరాబాద్ జట్టు తమ చెన్నై సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా..? అనేది చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

13 minutes ago

No Relief At Supreme, But AP Set For Poll Battle

A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…

43 minutes ago