
AP Braces for Cyclone Amid Local Polls
ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలు, మీడియా, ప్రజలు అందరూ స్థానిక సంస్థల తుఫానులో కొట్టుకుపోతుంటే, మరోపక్క నిజంగానే అర్నాబ్ తుఫాను రాష్ట్రం మీదకి దూసుకొస్తోంది. దీంతో ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైయున్న ప్రభుత్వ యంత్రాంగం అంతా హడావుడిగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
వాతావరణశాఖ అంచనాల ప్రకారం…
అక్టోబర్ 25 (ఆదివారం): బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చు.
అక్టోబర్ 26 (సోమవారం): వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, దీని ప్రభావిత జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అక్టోబర్ 27 (మంగళవారం): తుపాను తీవ్రత మరింత పెరుగుతుంది. దీని ప్రభావంతో కృష్ణా, బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురవవచ్చు.
అక్టోబర్ 28 (బుధవారం): అర్నావ్ తుపాను బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటవచ్చని అంచనా. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలియజేసింది.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని కనుక అందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలోకి వెళ్ళిన వారు తక్షణమే వెనక్కి తిరిగి వచ్చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తుఫానులు ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. కనుక హుద్ హుద్ తర్వాత దాదాపు ఆ స్థాయిలో రాష్ట్రంపై విరుచుకుపడుతున్న ఈ అర్నాబ్ తుఫాను మొదలవక ముందే వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు నిలువ చేసి ఉంచుకోవడం మంచిది.
అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు తుఫాను మొదలవక మునుపే సురక్షిత ప్రదేశాలకు చేరుకోవడం మంచిది.
BOTTOM LINE Recycled Plot, Wasted Pair RATING 1.25/5 PLATFORM | RUNTIME Aha Video | 1Hr…
Water is a basic necessity. Yet in Telangana, even drinking water has become a political…