
ఈమధ్యకాలంలో ప్రతి సినిమాకి ఆఖరి నిమిషంలో ఓవర్సీస్ కాపీలు, సెన్సార్ విషయంలో దర్శకనిర్మాతలు కంగారుపడుతుండడం చూస్తూనే ఉన్నాం. గతవారం విడుదలైన ‘బైకర్’ దర్శకుడు అభిలాష్ రెడ్డి కూడా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి తీరిక లేనంతగా ఫైనల్ కాపీ సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్నాడు.
రీసెంట్ రిలీజులు “కపుల్ ఫ్రెండ్లీ, విష్ణు విన్యాసం” సినిమాల పరిస్థితి కూడా అంతే. “విష్ణు విన్యాసం” సినిమాకి కనీసం ట్రైలర్ రిలీజ్ చేసే తీరిక కూడా దొరకలేదు చిత్రబృందానికి. ఇక ఇవాళ (ఏప్రిల్ 7) “డెకాయిట్” ఈవెంట్ కి డైరెక్టర్ షానిల్ హాజరు కాలేదు.
అందుకు కారణం వెలిబుచ్చుతూ అడివి శేష్ “మా డైరెక్టర్ ఓవర్సీస్ కాపీలు పంపించడంలో బిజీగా ఉన్నాడు, ఇంకో గంటలో కాపీలు వెళ్లాలి” అని రీజన్ చెప్పుకొచ్చాడు. నిజానికి ఓవర్సీస్ కాపీస్ ఎప్పుడూ కనీసం నాలుగు రోజుల ముందు పంపాలి. కానీ.. ఎందుకింత డిలే?
గతేడాది ఓజీ విడుదలప్పుడు కూడా ఫ్యాన్స్ చొరవ తీసుకొని ఓవర్సీస్ హార్ డిస్కులను తమ సొంత ఖర్చులతో థియేటర్లకి చేర్చారు. ఇంకొందరు స్వయంగా ప్రయాణించి మరీ సినిమా రిలీజయ్యేలా చేసారు. అందరూ అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను కొనియాడారు కానీ.. నిర్మాతల అలసత్వాన్ని ప్రశ్నించలేదు.
సుప్రియ లాంటి సీనియర్ & సిన్సియర్ నిర్మాత సారథ్యంలోనూ ఇలా ఆఖరి నిమిషం టెన్షన్లు అనేది ఆలోచించాల్సిన విషయమే.అసలు సమస్య ఎక్కడ? దర్శకులు ఎందుకని ఆఖరి నిమిషం వరకు చెక్కుతున్నారు? “ఆర్ఆర్ఆర్” లాంటి సినిమాకి కూడా రాజమౌళి నెలరోజుల ముందే ఫైనల్ కాపీ సిద్ధం చేసుకొని ప్రమోషన్స్ కి రంగంలోకి దిగాడు.
అలాంటప్పుడు మిగతా దర్శకులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నిజానికి “డెకాయిట్” అనేది మార్చి 19కి విడుదలవ్వాలి. కానీ.. “దురంధర్ 2” జోరు ముందు నిలబడడం కష్టం అని గ్రహించి “ఏప్రిల్ 10”కి పోస్ట్ పోన్ చేసారు.
అలాంటప్పుడు గత నెలాఖరుకే ఈ పనులన్నీ అయిపోవాలి కదా. వాయిదా వేసిన డేట్ కి కూడా ఎందుకీ టెన్షన్లు. మన దర్శకనిర్మాతలు ఈ ఆఖరి నిమిషం టెన్షన్ల నుండి ఎప్పుడు బయటపడతారో ఏమో.
Box office numbers have become unpredictable over the last few years. Movies without any hype…
Aditi Budhathoki turns golden hour into her personal fashion spotlight with a white lace dress…