“డెకాయిట్” సినిమా రివ్యూ: పేరు డెకాయిట్.. ఫీల్ డల్!

చిత్రం: డెకాయిట్

M9 రేటింగ్: 2.25/5

ADVERTISEMENT

విడుదల తేదీ: ఏప్రిల్ 10, 2026

తారాగణం: అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, కులకర్ణి, సునీల్ తదితరులు

నిర్మాణ సంస్థ: ఎస్.ఎస్.క్రియేషన్స్ & సునీల్ నారంగ్ ప్రొడక్షన్

దర్శకత్వం: షానిల్ డియో

కథ-కథనం: అడివి శేష్ – షానిల్ డియో

సంగీతం: భీమ్స్ – జ్ఞాని

నిర్మాత: సుప్రియ యార్లగడ్డ

ఛాయాగ్రహణం: ధనుష్ భాస్కర్

కూర్పు: కోదాటి పవన్ కళ్యాణ్

తెలుగులో డిపెండబుల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అడివి శేష్ టైటిల్ పాత్రలో నటించి, రచించి, స్క్రీన్ ప్లే కూడా అందించిన సినిమా “డెకాయిట్”. చాన్నాళ్ల తర్వాత సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాపై ఎనౌన్స్ మెంట్ టైమ్ నుండి మంచి హైప్ ఉంది. ఒక ప్రేమ కథ అంటూ ప్రమోట్ చేయబడిన ఈ సినిమా టీజర్ & ట్రైలర్ యాక్షన్ కట్స్ తో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందా లేదా అనేది చూద్దాం..!!

కథ:

హరిదాస్ (అడివి శేష్) తాను చేయని తప్పుకు 13 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించి, తన పుట్టినరోజునాడు జైల్ నుంచి తప్పించుకొని.. తనకి శిక్ష పడడానికి కారణమైన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూనియట్ (మృణాల్ ఠాకూర్) మీద పగతీర్చుకొని.. ఆపై దుబాయ్ వెళ్లిపోవాలనుకుంటాడు.

కట్ చేస్తే.. సరస్వతి ప్రస్తుత పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంది, హాస్పిటల్ బెడ్ మీద భర్త, హాస్పిటల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేని దయనీయ స్థితిలో చంటిపిల్లతో నానా ఇబ్బందులు పడుతుంటుంది. సరస్వతి సిచ్యుయేషన్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు హరి. ఆ క్రమంలో ఏం జరిగింది? అసలు సరస్వతి ఎందుకని హరికి శిక్ష పడడానికి కారణమైంది? వంటి ప్రశ్నలకు సమాధానమే “డెకాయిట్” చిత్రం.

నటీనటుల పనితీరు:

శేష్ లుక్స్ పరంగా పర్లేదు కానీ.. కొన్ని ఎమోషన్స్ ను పలికించడంలో మాత్రం తడబడ్డాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ లో “అంతఃపురం” సినిమాలో జగపతిబాబు లాంటి పెర్ఫార్మెన్స్ ఇద్దామనే ప్రయత్నం బెడిసికొట్టింది.

నటిగా మృణాల్ మరోసారి సరస్వతిగా మెప్పించింది. ఓ సగటు గృహిణిగా, పట్టువీడని మొండి తల్లిగా మంచి నటన కనబరిచింది. ఆ పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ & దాన్ని ఆమె క్యారీ చేసిన విధానం ఆకట్టుకుంటాయి.

అతుల్ కులకర్ణి, ప్రకాష్ రాజ్, కామాక్షి, సునీల్ వంటి నటులు చాలామంది ఉన్నప్పటికీ.. ఎవరి పాత్ర సరైన ఇంపాక్ట్ క్టియెట్ చేయలేకపోయింది.

మృణాల్ కూతురుగా నటించిన చిన్నారి ఆనమ్ మాత్రం మంచి స్మైల్ తో అలరించింది. ఆ పాప ద్వారా రివీల్ అయ్యే ట్విస్ట్ కూడా ఆమె ఎక్స్ ప్రెషన్ వల్ల కాస్త హై ఇవ్వగలిగింది.

సాంకేతికవర్గం పనితీరు:

టెక్నికల్ గా స్ట్రాంగ్ సినిమా డెకాయిట్. కోదాటి పవన్ కళ్యాణ్ కట్స్ & ట్రాన్సిషన్స్ బాగున్నాయి. కథనం మీద ఆసక్తి కలిగించడంలో అతడి ఎడిటింగ్ హెల్ప్ అయ్యింది. అలాగే.. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ముఖ్యంగా ఆనమార్ఫిక్ లెన్స్ తో తీసిన లవ్ సీక్వెన్సులు & వైడ్ ఫ్రేమ్స్ బాగున్నాయి. కలరింగ్ విషయంలో తీసుకున్న కేర్ ప్రశంసార్హం.

భీమ్స్ పాటలు ఆకట్టుకోలేకపోయాయి. అసలు చిచ్చుబుడ్డి అక్కడ ఎందుకొచ్చిందో, అవసరం ఏముందో అర్థం కాదు. జ్ఞాని బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఎంగేజింగ్ గా ఉంది. శ్రీకర్ మిక్సింగ్ & సౌండ్ డిజైన్ కూడా హైలైట్స్ గా నిలిచాయి.

విశ్లేషణ:

ఈ సినిమా జనాల్లోకి వెళ్లడానికి ముఖ్యుడైన శేష్.. ఈ సినిమాకి మైనస్ కూడా అయ్యాడు. అతడికున్న ఇమేజ్ సినిమాకి ప్లస్ పాయింట్ అయితే.. రైటర్ & యాక్టర్ గా శేష్ కేపబిలిటీ సినిమాకి మైనస్.

ముఖ్యంగా సినిమాకి ఎలాంటి టోనాలిటీ యాడ్ చేయలేని సీమ యాస ఎందుకని ఇరికించారో అర్థం కాదు. కొన్ని పాత్రలు కాసేపు సీమ యాస మాట్లాడతాయి, కాసేపు న్యూట్రల్ తెలుగు మాట్లాడేస్తాయి. ఆమాత్రం దానికి యాసను టీజర్ & ట్రైలర్ లో అంతగా ఎలివేట్ చేయడం ఎందుకు అనిపిస్తుంది. అలాగే.. రైటర్ గా కథనంలో బలవంతంగా కుక్కిన కుల అహంకారం, కోవిడ్ టైంలో జనాల్ని దోచుకున్న హాస్పిటల్స్ దాష్టీకం వంటి వాటికి సరైన క్లోజర్ లేదు. అయితే.. రైటర్ శేష్ మ్యాజిక్ వర్కవుట్ అయిన ఏకైక సీక్వెన్స్ ఆ లాకెట్ & రింగ్ మాత్రమే. అదొక్కటి మాత్రం ఎగ్జైట్ చేసింది.

నిజానికి సినిమా ఎండింగ్ ఏంటి అనేది ఆల్మోస్ట్ జనాలు గెస్ చేసేస్తారు కానీ.. శేష్ లాంటి రైటర్ అలాంటి డ్రమాటిక్ ఎండింగ్ ఇవ్వడులే అనుకుంటే.. సరిగ్గా ఎక్స్ పెక్ట్ చేసిన ఎండింగ్ తో ఓ పాత సినిమా గుర్తుచేస్తాడు.

టెక్నికల్ గా బాగుంది అనిపించినా.. సరైన ఎమోషన్ వర్కవుట్ అవ్వకపోవడంతో సినిమాగా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆడియన్స్ ఎలాంటి సినిమాల్ని చూస్తున్నారు, వాళ్ల మైండ్ సెట్ ఎలా మారింది? థియేటర్ కి వస్తే ఏస్థాయి కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు అనే క్లారిటీ ఉన్న శేష్ థాట్ ప్రాసెస్ ఈసారి మాత్రం మెప్పించలేకపోయింది. ఎమోషన్ ను ట్విస్ట్ కి జోడించి ఆడియన్స్ ను ఎంగేజ్ చేయాలనుకోవడం మిస్ ఫైర్ అయ్యింది. కథను ఓపెన్ చేసిన విధానం బానే ఉంది అనుకునే తరుణంలో వచ్చే పాటలు, వాటి ప్లేస్మెంట్, హాస్పిటల్ సీన్స్, రాబరీ సీక్వెన్సులు, వాటి రివిలేషన్.. ఏదీ సరిగా సింక్ అవ్వలేదు. అందువల్ల ఆసక్తి కలిగించాల్సిన సన్నివేశాలు, సందర్భాలు అలా వచ్చి వెళ్లిపోతుంటాయి.

అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాకి 149 వర్కింగ్ డేస్ ఎందుకు అనే ప్రశ్న మెదడును తొలిచేస్తూ ఉంటుంది. శృతిహాసన్ ఎగ్జిట్ తో రీషూట్స్ ఎక్కువ జరిగాయేమో అని మనకి మనమే సర్దిచెప్పుకోవాలి. శేష్ సినిమాలంటేనే ఆడియన్స్ థియేటర్స్ కి మినిమం ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తారు. అలాంటివాళ్లను ఎంగేజ్ చేయలేకపోయింది “డెకాయిట్”.

ఓవరాల్ గా.. పేరు డెకాయిట్.. ఫీల్ మాత్రం డల్!

M9 News రేటింగ్: 2.25/5

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Published by

Recent Posts

Kavitha Picked PK As Target, But Why???

Telangana politics are turning out to be extremely interesting in nature as we have multiple…

3 minutes ago

మిత్రుడు కోసం వచ్చి.. రాష్ట్రానికీ మేలు చేశారు కిలారు రాజేశ్!

హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ తరగతి గదుల్లో మొదలైన ఓ సాదాసీదా బాల్య స్నేహం, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే…

6 minutes ago