
ఆయన రాజకీయ ప్రస్థానం టిడిపిలోనే మొదలైంది కానీ అనూహ్యంగా వైసీపీలో తేలారు. మంత్రిగా రెండున్నరేళ్ళపాటు ప్రతిపక్ష నేతలను ఉద్దేశ్యించి ఆయన రోజూ బూతు పురాణం చదువుతున్నప్పుడు ఇక ఆయనకు వైసీపీలో తిరుగేలేదని అందరూ అనుకొన్నారు. కానీ బూతుల మంత్రి అని కూడా చూడకుండా జగనన్న ఆయనకి పెద్ద షాక్ ఇచ్చేసి కుర్చీలో నుంచి దించేశారు. నేటికీ ఆయన ఆ షాక్ నుంచి ఇంకా తేరుకొన్నట్లు లేదు అందుకే మీడియా ముందు పెద్దగా కనిపించడం లేదు.
అయితే మీడియా ముందుకు వస్తే మాత్రం అలవాటు ప్రకారం చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ను నాలుగు బూతులు తిట్టకుండా ఉండలేరు. తద్వారా వారిని పదేపదే రెచ్చగొడుతున్నట్లు అవుతోందని గ్రహించడం లేదు. కనుక చంద్రబాబు నాయుడు కొడాలికి వచ్చే ఎన్నికలలో చెక్ పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో బిజెపి పరిస్థితి ఏమంత గొప్పగా లేదు కనుక దగ్గుబాటి పురందేశ్వరిని టిడిపిలోకి ఆహ్వానించి గుడివాడ నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తునట్లు తాజా సమాచారం. ఒకవేళ ఆమె అందుకు అంగీకరించకపోతే బిజెపి తరపున గుడివాడ నుంచే పోటీ చేసే మాటైతే ఆమెకు పరోక్షంగా పూర్తి సహాయసహకారాలు అందించడానికి కూడా చంద్రబాబు నాయుడు సిద్దపడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమె అంగీకరిస్తే గుడివాడలో టిడిపి, బిజెపి, జనసేన మూడు పార్టీలు ఆమెకు అండగా నిలబడి కొడాలి నానికి చెక్ పెట్టాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో మంత్రి పదవిలో నుంచి దిగిపోతేనే పార్టీలో పట్టించుకొనే నాధుడు ఉండడు. ఇక వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా కూడా కొడాలి నాని గెలవలేకపోతే అంతటితో ఆయన రాజకీయ జీవితం సమాప్తం అయిపోతుందని వేరే చెప్పక్కరలేదు.
అయితే టిడిపిలో వినిపిస్తున్న ఈ గుసగుసలు నిజమో కాదో రాబోయే రోజుల్లో క్రమంగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే కొడాలి నాని ఇప్పటి నుంచే మరో దారి వెతుక్కోక తప్పదు.
తాజా సమాచారం: చంద్రబాబు నాయుడు తోడల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వర రావుకి గుండెపోటు రావడంతో ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబంతో చాలా కాలంగా దూరంగా ఉన్నప్పటికీ, ఈవిషయం తెలియగానే చంద్రబాబు నాయుడు వెంటనే హాస్పిటల్కు వెళ్ళి దగ్గుబాటి దంపతులను పరామర్శించారు. వారు కూడా ఆయనతో ఆప్యాయంగా మాట్లాడారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…