
నవంబర్ లో సినిమా విడుదల చేసే అవకాశం ఉందంట. ఇందులో సురేష్ బాబు ఇంకో లెక్క కూడా ఉంది. దసరా సీజన్ లో ఆయన కింద ఉన్న థియేటర్లన్నింటికీ మంచి గిరాకీ ఉంటుంది. అయితే నవంబర్, డిసెంబర్ మాత్రం డల్ పీరియడ్. డిసెంబర్ కోసం దబాంగ్-3 ని తెలుగులో విడుదల చేస్తున్నారు సురేష్ బాబు. నవంబర్ లో థియేటర్ల ఫీడింగ్ కోసం వెంకీ మామను అప్పుడు విడుదల చెయ్యడానికి నిర్ణయించారు. అయితే నవంబర్ లో విడుదలైతే రావాల్సిన కలెక్షన్లు రావని అభిమానుల ఆగ్రహం.
దీనితో వారు సురేష్ బాబు మీద గుర్రుగా ఉన్నారు. అయితే సురేష్ బాబు మాత్రం అసలు మేము అక్టోబర్ 4న విడుదల చెయ్యబోతున్నట్టు ఎప్పుడు చెప్పాం అని తెలివిగా అడుగుతున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్పుత్ నటిస్తుండగా… నాగ చైతన్యకు జోడిగా రాశీ ఖన్నా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జై లవ కుశ’ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…
A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…