
ఎన్టీఆర్ టిడిపిని స్థాపించినప్పుడు దగ్గుబాటి వెంటేశ్వరరావు పార్టీలో చాలా కీలకపాత్ర పోషించారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి లోక్సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా చేశారు. చంద్రబాబు నాయుడుతో విభేధాలు ఏర్పడిన తర్వాత బిజెపిలో చేరారు. ఆ తర్వాత వైఎసార్ కాంగ్రెస్లో చేరారు. 2019లో పర్చూరు నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్ధి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. తన కుమారుడు హితేష్ని ప్రత్యక్ష రాజకీయాలలో తెచ్చేందుకు ప్రయత్నించారు కానీ వీలుపడక ఆ ఆలోచన విరమించుకొన్నారు. సుమారు నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాలలో ఉన్న దగ్గుబాటి వైసీపీలో చేరిన 4 ఏళ్ళకే రాజకీయాలపై విరక్తి చెందడం చూస్తే ఆ పార్టీ రాజకీయాలు ఏవిదంగా సాగుతున్నాయో అర్దం చేసుకోవచ్చు. ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్ వంటివారు కూడా తమ పార్టీ వైఖరితో విసుగెత్తిపోయామని బహిరంగంగానే చెపుతున్నారు.
ఈ కారణంగా దగ్గుబాటి వేంకటేశ్వర రావు వైసీపీ నుంచి తప్పుకొని మళ్ళీ టిడిపిలోకి వస్తారని అందరూ భావిస్తుంటే ఆయన ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఆయన భార్య, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం బిజెపిలో కొనసాగుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ పట్ల బిజెపి అలసత్వం ప్రదర్శిస్తుండటంతో పార్టీలో పలువురు నేతల్లాగే ఆమె కూడా మౌనంగా ఉండిపోతున్నారు. ఈ పరిస్థితులలో ఆమె బిజెపిలో కొనసాగుతారా లేక ఆమె కూడా తప్పుకొంటారో?
Music composer Anirudh and Sunrisers Hyderabad CEO Kavya Maran are making headlines after their wedding…
Sanchi Rai gives the saree a moodier, more playful makeover in this warm, intimate photoshoot.…