
చైనాలో విడుదలైన ఈ సినిమా కనివినీ ఎరుగని రీతిలో బ్రహ్మాండమైన విషయం సాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా 2000 కోట్ల క్లబ్ లోకి చేరిందన్న సమాచారమే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. చైనాను మినహాయిస్తే… 792 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ‘దంగల్’ సొంతం. 2000 కోట్ల క్లబ్ లో చేరాలి అంటే చైనా మార్కెట్ లో దాదాపుగా 1200 కోట్లు పైనే కొల్లగొట్టాలి.
దీనిపై ఎప్పటికప్పుడు ట్రేడ్ విశ్లేషకులు అఫీషియల్ గానే లెక్కలు వదిలారు. అయితే 1150 కోట్ల వరకు దాదాపుగా అధికారిక లెక్కలు వచ్చాయి. అయితే ఆ తర్వాత చైనాలో కూడా ‘దంగల్’ దూకుడు తగ్గడంతో, ఇక 2000 కోట్లకు చేరుకోవడం కష్టమే అన్న సంకేతాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇంతలోనే ఈ ప్రకటన రావడంతో, నిజంగా ‘దంగల్’ 2000 కోట్లకు చేరుకుందా? లేక బాలీవుడ్ సినిమానే ముందుగా ఆ మార్క్ అందుకోవాలన్న ఉద్దేశంతో ఆ ప్రకటన చేసారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
సెప్టెంబర్ లో చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న “బాహుబలి 2” 350 కోట్లు కొల్లగోడితే 2000 కోట్ల క్లబ్ లో చేరుతుంది. ఈ మార్క్ ను అవలీలగా అందుకుంటుందని కూడా దాదాపుగా ఖరారైన విషయం. దీంతో ఒక తెలుగు సినిమా ‘బాహుబలి 2’ కంటే ముందు, ఆ మార్క్ ను బాలీవుడ్ మూవీ అందుకుందన్న రికార్డు కోసమే ‘దంగల్’పై సదరు ప్రకటన వచ్చిందని సోషల్ మీడియా వేదికగా సినీ అభిమానులు మండిపడుతున్నారు. చైనా మార్కెట్ లో 1150 కోట్ల తర్వాత ‘దంగల్’పై అధికారిక లెక్కలేవి? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Mahi Gaur brings an intoxicating wave of monsoon magic to the fashion spotlight with an…
418, the Telugu horror-thriller presented by Prashanth Neel, was supposed to release on July 31,…