Telugu

ఫుల్ క్లారిటీ – 2016 టాప్ సినిమా అదే!

ఒక ఏడాదిలో ఇండియా మొత్తమ్మీద కొన్ని వందల సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ, బాక్సాఫీస్ వద్ద సందడి చేసే సినిమాలు మాత్రం పదుల సంఖ్యలోనే. అందులో కూడా విమర్శకులు మెచ్చే సినిమాలు కేవలం పదుల సంఖ్యలోనే. ఆ పదుల సంఖ్యలో కూడా నెంబర్ 1 సినిమాగా నిలవాలంటే… ఆ సినిమా ఏ స్థాయిలో ఉండాలి. అమీర్ ఖాన్ తాజాగా నటించిన “దంగల్” సినిమా ఆ స్థాయిలోనే ఉందని విమర్శకులు నీరాజనాలు పలుకుతున్నారు.

‘అమీర్ ఖాన్ నటించిన “పీకే” సినిమా విడుదల తర్వాత ఆ స్థాయి రేటింగ్స్ అందుకోవాలంటే, అది మళ్ళీ అమీర్ ఖాన్ సినిమానే సాధించాలి’ అని అభిమానులు గర్వంగా చెప్పుకునే విధంగా “దంగల్” సినిమాకు రివ్యూ రేటింగ్స్ వచ్చాయి. ఒక్క విమర్శకుడు కూడా తక్కువ రేటింగ్ ఇవ్వడానికి ఆస్కారం లేని విధంగా, ఈ సినిమాకు సినీ విశ్లేషకులు టాప్ రేటింగ్స్ తో స్వాగతం పలికారు. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు, వెబ్ సైట్స్ అందించిన ఈ రివ్యూస్ తో ‘దంగల్’ బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ అందుకోవడం ఖాయం.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కేసీఆర్‌కి చెప్తే వినలేదు… మీరైనా వింటారా రేవంత్?

తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…

25 minutes ago

Beyond Their Own Films: Directors Making Room for New Talent

Becoming a director in the film industry is one thing. Getting someone to trust you…

34 minutes ago