
ఈ సినిమాను డిస్నీ యూ టీవీతో కలిసి సొంతం నిర్మించిన అమీర్ ఖాన్, నటుడిగా, నిర్మాతగా కలిపి మొత్తం 175 కోట్లు సొంతం చేసుకున్నాడన్న సమాచారాన్ని ‘పింక్ విల్లా’ అనే ప్రముఖ వెబ్ సైట్ స్పష్టం చేసింది. ఈ సినిమాలో హీరోగా నటించినందుకు గానూ 35 కోట్లు తీసుకున్న అమీర్, సినిమాకు వచ్చిన లాభాల రీత్యా మరో 140 కోట్లు సొంతం చేసుకున్నాడనేది ఈ వార్తల సారాంశం. ఈ సినిమాకు వచ్చిన లాభాలలో 33 శాతం అమీర్ కు చెంది ఉండడంతోనే ఇంత మొత్తం దక్కిందని తెలుస్తోంది.
అయితే ఈ కలెక్షన్స్ హవా ఇక్కడితో ఆగిపోదు. భవిష్యత్తులో ఈ సినిమా ద్వారా ఎలాంటి ఆదాయం లభించినా కూడా అందులో ఓ 33 శాతం వాటా అమీర్ కు చెందుతుంది గనుక, మ్యాజిక్ ఫిగర్ 200 కోట్లను అమీర్ అందుకోవచ్చని బాలీవుడ్ టాక్. అయితే ఎన్ని కోట్లు అందుకున్నా, ఎంత ఖర్చు పెట్టినా అమీర్ ఖాన్ కున్నంత డెడికేషన్ మరో హీరోకు ఉండదని చెప్పడంలో సందేహం లేదు, మరో మాటకు ఆస్కారం లేదు. కాబట్టి అమీర్ చిత్తశుద్ధి ముందు ఈ కరెన్సీ కట్టలకు విలువ లేదన్నది అసలు నిజం.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…